వినోదం

Sai Pallavi : ఇంత వ‌ర‌కు జిమ్‌లో అడుగుపెట్టని సాయి ప‌ల్లవి అంత ఫిట్‌గా ఎలా ఉంది ?

Sai Pallavi : హీరోలు లేదా హీరోయిన్ లు ప‌ర్‌ఫెక్ట్ స్ట్రక్చ‌ర్ మెయింటైన్ చేసేందుకు జిమ్‌కి వెళుతుంటారు. తాము సరైన ఆకృతిలో ఉండడానికి చెమ‌ట‌లు ప‌ట్టేలా వ‌ర్క‌వుట్స్ చేస్తుంటారు. అయితే వ‌ర్క‌వుట్స్ క‌న్నా డ్యాన్స్ చేస్తే మంచి ఫ‌లితాన్ని ఇస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 30 నిమిషాల పాటు డ్యాన్స్‌ చేస్తే.. 400 కేలరీలు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

తన నటనతోపాటు నృత్యానికి సహజ రూపాన్నిచ్చే సాయిపల్లవి ఏనాడూ జిమ్‌కు వెళ్లలేదు. కానీ బాడీని చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకుంటుంది. ఆమె డ్యాన్స్‌ చేస్తే.. నెమలి పురివిప్సి డ్యాన్స్‌ చేస్తున్నట్లు ఉంటుంది. ఈమె ఫిట్‌ నెస్‌ సీక్రెట్స్‌ ఏంటో మీకు తెలుసా ? డ్యాన్స్ మాత్ర‌మేన‌ట‌. నిజానికి సాయిపల్లవి ఇప్పటి వరకు జిమ్‌కు వెళ్లలేదు. తనకు జిమ్‌ చేయడానికి ప్రత్యామ్నాయం డ్యాన్స్‌ తప్ప మరేమీ లేదు అంటుంది.

sai pallavi fitness secret do you know about it

తాను రోజూ డ్యాన్స్ చేయ‌డం వ‌ల‌న ఫిట్‌గా ఉన్నాన‌ని చెబుతోంది. ఫిట్‌ నెస్‌ను కాపాడుకోవడానికి డాన్స్‌ చేస్తే సరిపోతుందని సాయి పల్లవి అంటోంది. షూటింగ్‌ విరామాల్లో డ్యాన్స్‌ చేస్తూ.. టైం పాస్‌ చేస్తున్నానని తెలిపింది. డ్యాన్స్‌ చేయడం వల్ల రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని, బాడీ ఫిట్‌గా ఉండాలంటే.. క్రమం తప్పకుండా డ్యాన్స్‌ చేయాల్సిందే.. అంటున్నారు నిపుణులు.

Admin

Recent Posts