వినోదం

మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై స‌మంత స్పంద‌న‌.. ఏమ‌న్న‌దంటే..?

మంత్రి కొండా సురేఖ తాజాగా నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఆమె చేసిన కామెంట్స్ అబ‌ద్ధ‌మ‌ని ఇప్ప‌టికే నాగార్జున ప్ర‌క‌టించారు. అలాగే ఆయ‌న భార్య అమ‌ల కూడా వెంట‌నే త‌మ‌కు సారీ డిమాండ్ చేశారు. దీంతోపాటు స‌మంత‌, నాగ‌చైత‌న్య కూడా ఈ ఇష్యూపై స్పందించారు. స‌మంత సోష‌ల్ మీడియాలో ఈ సంద‌ర్భంగా పెట్టిన ఒక పోస్టు వైర‌ల్‌గా మారింది.

త‌న విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరోయిన్ స‌మంత స్పందించారు. మ‌హిళ‌ల్ని వ‌స్తువుల్లా చూసే ఈ గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేయ‌డం, ప్రేమ‌లో ప‌డ‌డం, నిల‌బ‌డి పోరాడ‌టానికి చాలా శ‌క్తి కావాలి. నా ప్ర‌యాణాన్ని చిన్న చూపు చూడొద్దు. ఇక విడాకులు అనేవి పూర్తిగా నా వ్య‌క్తిగ‌త విష‌యం. అది ఇద్ద‌రి అంగీకారంతో, ఎటువంటి రాజ‌కీయ కుట్ర లేకుండా జ‌రిగింది. ద‌య చేసి నా పేరును రాజ‌కీయాల‌కు దూరం పెట్టండి.. అని ఓ ప్ర‌క‌ట‌న‌లో సూచించారు.

samantha responded to minister konda surekha comments

మ‌రోవైపు హీరోలు నాని, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, ర‌చ‌యిత కోన వెంక‌ట్ సైతం ఈ వ్యాఖ్య‌లను ఖండించారు. వైసీపీ మాజీ మంత్రి, సినీ న‌టి రోజా స్పందిస్తూ కొండా సురేఖ వ్యాఖ్య‌లు అత్యంత జుగుప్సాక‌ర‌మ‌ని అన్నారు. అయితే దీనిపై తెలంగాణ మంత్రులు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ మంత్రి సురేఖ మ‌ళ్లీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Admin

Recent Posts