Set Dosa : హోట‌ల్స్‌లో ల‌భించే సెట్ దోశ‌ల‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Set Dosa : మ‌న‌లో చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటారు.అల్పాహారంగా తిన‌డానికి దోశ‌లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో సెట్ దోశ కూడా ఒక‌టి. బెంగుళూరు స్పెష‌ల్ అయిన ఈ సెట్ దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు హోటల్స్ లో కూడా ఈ సెట్ దోశ‌లు చాలా సుల‌భంగా ల‌భిస్తాయి. ఎంతో రుచిగా, మెత్త‌గా ఉండే ఈ సెట్ దోశ‌ల‌ను మనం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, మెత్త‌గా ఉండే ఈ సెట్ దోశ‌ల‌ను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సెట్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దోశ బియ్యం లేదా రేష‌న్ బియ్యం – 2 క‌ప్పులు, మిన‌ప‌ప్పు – పావు క‌ప్పు, మెంతులు – అర టీ స్పూన్, అటుకులు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌.

Set Dosa recipe in telugu make in this way
Set Dosa

సెట్ దోశ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో బియ్యాన్ని తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిన‌ప‌ప్పు, మెంతులు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత నీటిని తీసేసి బియ్యాన్ని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత మ‌రో గిన్నెలో అటుకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. త‌రువాత ఈ అటుకులను కూడా బియ్యంలో వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని జార్ లో వేసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండినంతా మిక్సీ ప‌ట్టుకున్న త‌రువాత మ‌రోసారి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి.

త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 8 గంట‌ల పాటు పులియ‌బెట్టుకోవాలి. పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత ఉప్పు వేసి క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక గంటె లేదా గంటెన్న‌ర పిండిని తీసుకుని మందంగా ఉండే దోశ‌లాగా వేసుకోవాలి. పిండి త‌డి పోయిన త‌రువాత నూనె వేసుకోవాలి. దోశ ఒక‌వైపు కాలిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకోవాలి. దీనిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే సెట్ దోశ త‌యార‌వుతుంది. దీనిని ప‌ల్లీ చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts