inspiration

చిన్న వ‌య‌స్సులో ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా మారిన స్మిత స‌బ‌ర్వాల్.. ఆమె స‌క్సెస్ స్టోరీ ఇదే..!

స్మితా సబర్వాల్.. రెండు తెలుగు రాష్ట్ర‌ ప్రజలకు.. అందులోనూ తెలంగాణవాసులకు పరిచయం అక్కర్లేని పేరు. 23 ఏళ్ల వయసులో రెండో అటెంప్ట్‌లోనే యూపీఎస్సీ క్లియర్ చేసి.. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్‌ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది స్మిత‌.22 ఏళ్లకే యూపీఎస్సీలో 4వ ర్యాంక్ సాధించారు. స్మిత 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జన్మించిన స్మిత సబర్వాల్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కుమార్తె. ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తన మొదటి ప్రయత్నంలో ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. అయితే ఐఏఎస్ కావాల‌నే ప‌ట్టుద‌లతో యూపీఎస్సీ నుండి 2000లో తన రెండవ ప్రయత్నంలో ఐఏఎస్ అధికారి అయ్యారు.అప్పుడు స్మిత సబర్వాల్ వయసు 23 సంవత్సరాలు.

23 ఏళ్ల వ‌య‌స్సులో పబ్లిక్ సర్వెంట్‌గా కీలకమైన బాధ్యతలు అందుకున్న స్మిత‌ విజయవంతంగా నిర్వర్తిస్తూ.. ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. భార్యగా, తల్లిగా, ఐఏఎస్ అధికారిగా అన్ని పాత్రలను ఎంతో సమర్థమంతంగా పోషిస్తున్న స్మితా సబర్వాల్ జీవితంలోనూ.. మధురమైన క్షణాలు, భావోద్వేగ సంఘటనలు ఉన్నాయి. స్మితా సబర్వాల్ హైదరాబాద్‌లోని మారేడ్ పల్లిలోని సెయింట్ ఆన్స్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. దీని తరువాత స్మిత సెయింట్ ఫ్రాన్సిస్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి తన B.Com డిగ్రీని పూర్తి చేసారు. తాను ఆర్మీలోకి వెళ్లబోయి అనుకోకుండా ఐఏఎస్ అయ్యానంటూ తన జీవితంలోని టర్నింగ్ పాయింట్‌ గురించి చెప్పుకొచ్చారు స్మితా సబర్వాల్. తమది ఆర్మీ కుటుంబమని గుర్తు చేసిన స్మితా సబర్వాల్.. తన విద్యాభ్యాసమంతా కేంద్రీయ విద్యాలయాల్లోనే సాగిందన్నారు.

smita sabharwal success story will surprise you

తనలో ప్రజాసేవ చేయాలన్న కోరికను గమనించిన తన తండ్రి.. ఆర్మీలో అయితే కేవలం ఏడెనిదేళ్లకే కెరిర్ ముగుస్తుందని వివరించి.. డైరెక్టుగా తీసుకెళ్లి ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేసినట్టుగా తెలిపారు. డిగ్రీ థర్డ్ ఇయర్‌లో మొదటి అటెంప్ట్ చేసినా.. అటు చదువు, ఇటు యూపీఎస్సీ బ్యాలెన్స్ చేయలేకపోయానని.. కానీ సెకండ్ అటెంప్ట్‌లో గట్టిగా ట్రైం చేయటంతో.. ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సాధించినట్టుగా వివరించారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్మితా దాస్.. పంజాబ్‌కు చెందిన అకున్ సబర్వాల్‌తో 2004లో వివాహం జరిగింది. అయితే.. వీళ్లిద్దరిదీ ప్రేమ పెళ్లి అనుకుంటున్నారని.. కానీ వాళ్లది మాత్రం అరెంజ్డ్ మ్యారేజేనని తెలిపారు. అయితే.. ఇద్దరివీ ఆర్మీ కుటుంబాలేనని.. ముందుగానే తమ కుటుంబాల మధ్య మంచి పరిచయం ఉందన్నారు. అకాడమీలోనే అకున్ తనకు అకాడమీలోనే పరిచయం అయినా.. తాము ఒకరితో ఒకరు దగ్గరవటానికి తమ కుటుంబాలే ప్రోత్సహించాయని చెప్పుకొచ్చారు.తెలంగాణ గత ప్రభుత్వంలో సీఎంవోలో కీలక బాధ్యతలు చేపట్టిన స్మిత సబర్వాల్ తొలి మహిళా ఐఏఎస్‌గా ఆమె ఘనత సాధించారు. స్మిత తెలంగాణలోని వరంగల్, విశాఖపట్నం, కరీంనగర్, చిత్తూరు సహా పలు ప్రాంతాల్లో సేవలందించారు.

Sam

Recent Posts