Sonthi Karam : శొంఠి కారం త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద‌లో తింటే ఎంతో ఆరోగ్యం..!

Sonthi Karam : శొంఠి.. ఇది మ‌నందిరికి తెలిసిందే. శొంఠిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, ఇన్పెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, వాతాన్ని త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా శొంఠి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ శొంఠితో మ‌నం కారం పొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. 6 నెల‌ల పిల్ల‌ల నుండి ముసలి వారి వ‌ర‌కు ఎవ‌రైనా ఈ కారం పొడిని తీసుకోవ‌చ్చు. త‌రుచూ వాతం చేసే వారు ఈ కారం పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ శొంఠి కారం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

శొంఠి కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, శొంఠి – 50 గ్రా., జీల‌క‌ర్ర – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌.

Sonthi Karam recipe make in this method very tasty and healthy
Sonthi Karam

శొంఠి కారం పొడి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక శొంఠి వేసి వేయించాలి. దీనిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వేయించిన శొంఠిని రోట్లో వేసి ముక్క‌లుగా దంచుకుని జార్ లో వేసుకోవాలి. త‌రువాత వేయించిన మిగిలిన ప‌దార్థాలు, ఉప్పు వేసి మెత్త‌ని పొడిలా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే శొంఠికారం త‌యార‌వుతుంది. దీనిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ‌చేసుకోవ‌డం వ‌ల్ల 6 నుండి 8 నెల‌ల పాటు నిల్వ చేసుకోవ‌చ్చు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, చిటికెడు శొంఠి పొడి వేసి క‌లిపి ఒక ముద్ద తీసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది.

D

Recent Posts