Stuffed Okra Fry : బెండ‌కాయ‌ల్లో ఇలా మ‌సాలా కూరి ఫ్రై చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Stuffed Okra Fry : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా వేపుడు, పులుసు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. త‌ర‌చూ ఒకే రకం వంట‌లు కాకుండా బెండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే స్ట‌ఫ్డ్ బెండ‌కాయ ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10 నిమిషాల్లోనే తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా ఉండ‌డంతో పాటు, సుల‌భంగా చేసుకోద‌గిన ఈ స్టఫ్డ్ బెడ‌కాయ ఫ్రైనుఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట‌ఫ్డ్ బెండ‌కాయ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బెండ‌కాయ‌లు – 10, నూనె – 2 టీ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Stuffed Okra Fry recipe in telugu make in this way
Stuffed Okra Fry

కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టీ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి పొడి – 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, ప‌సుపు – చిటికెడు, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్.

స్ట‌ఫ్డ్ బెండ‌కాయ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు వేగిన త‌రువాత ఎండు కొబ్బ‌రి పొడి వేసి కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే జార్ లో కారానికి కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బ‌ర‌క‌గా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత బెండకాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి తొడిమెల‌ను తీసివేయాలి. త‌రువాత వీటికి నిలువుగా గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ ప‌ట్టుకున్న కారం పొడిని బెండ‌కాయ‌ల్లో స్ట‌ఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బెండ‌కాయ‌ల‌ను వేసుకోవాలి. ఈ బెండ‌కాయ‌ల‌ను ఒక‌దాని ప‌క్క‌కు ఒక‌టి ఉంచి మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత ఈ బెండ‌కాయ‌ల‌ను మ‌రో వైపుకు తిప్పుకుని మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత మిగిలిన కారం పొడి చ‌ల్లుకుని మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు నెమ్మ‌దిగా అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. బెండ‌కాయ‌లు పూర్తిగా వేగే వ‌ర‌కు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్ట‌ఫ్డ్ బెండ‌కాయ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో నేరుగా తిన‌వ‌చ్చు. అలాగే సైడ్ డిష్ గా కూడా తిన‌వ‌చ్చు. బెండ‌కాయలంటే ఇష్టం లేని వారు కూడా స్ట‌ఫ్డ్ బెండ‌కాయ‌ల‌ను ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts