White To Black Hair : కెమిక‌ల్స్ వాడాల్సిన ప‌నిలేదు.. వీటితో మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..!

White To Black Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల‌జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పూర్వ‌కాలంలో కేవ‌లం పెద్ద వారిలోనే క‌నిపించే ఈ స‌మ‌స్య నేటిత‌రుణంలో చిన్న వ‌య‌సు వారిలో కూడా క‌నిపిస్తుంది. కార‌ణాలేవైన‌ప్ప‌టికి ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. మార్కెట్ లో ల‌భించే హెయిర్ డైలను కొనుగోలు చేసి జుట్టుకు రంగు వేస్తూ ఉంటాము. ఈ హెయిర్ డై ల‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మారిన‌ప్ప‌టికి వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. హెయిర్ డైల‌లో అనేక ర‌కాల ర‌సాయనాల‌ను వాడుతూ ఉంటారు.

వీటిని ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, జుట్టు బ‌ల‌హీన‌ప‌డ‌డం, త‌ల‌లో దుర‌ద వంటి అనేక ర‌కాల ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అయితే హెయిర్ డైల‌కు బ‌దులుగా కొన్ని ర‌కాల స‌హ‌జ సిద్ద ప‌దార్థాల‌ను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా జుట్టును న‌ల్ల‌గా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేసుకోవ‌చ్చు. జుట్టును న‌ల్ల‌గా మార్చే స‌హ‌జ సిద్ద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ బీట్ రూట్ ను తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ లో ఒక స్పూన్ తేనె, స్పూన్ కొబ్బ‌రి నూనె క‌లపాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి ఒక గంట త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి.

White To Black Hair use these natural items
White To Black Hair

ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డంతో పాటు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే కాఫీ పౌడ‌ర్ ను ఉప‌యోగించి కూడా మ‌నం న‌ల్ల‌గా చ‌క్క‌గా మెరిసేలా చేసుకోవ‌చ్చు. దీని కోసం అర క‌ప్పు కాఫీ డికాష‌న్ లో అర క‌ప్పు హెయిర్ కండీషన‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత దీంట్లో అర టీ స్పూన్ కాఫీ పొడిని వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టించి ఆరిన త‌రువాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు చ‌క్క‌టి నిగారింపును సొంతం చేసుకుంటుంది. అలాగే అర క‌ప్పు దాల్చిన చెక్క పొడిలో అర‌క‌ప్పు కండిష‌న‌ర్ వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి ఆరిన త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డంతో పాటు జుట్టు చ‌క్క‌గా మెరుస్తుంది.

అలాగే ఒక క‌ప్పు హెన్నా పౌడ‌ర్ లో 3 స్పూన్ల పెరుగు వేసి క‌ల‌పాలి. ఇందులో త‌గిన‌న్నీ వేడి నీళ్లు పోసుకుంటూ గ‌ట్టి పేస్ట్ లాగా క‌లుపుకోవాలి. దీనిని 8 గంటల పాటు క‌దిలించ‌కుండా అలాగే ఉంచాలి. త‌రువాత ఇందులో క‌ప్పు ఇండిగో పౌడ‌ర్, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి ఆరిన త‌రువాత సాధార‌ణ నీటితో త‌ల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్యాక్ వేసుకున్న మరుస‌టి రోజు షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. ఈ విధంగా ఈచిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల స‌హజ సిద్దంగా జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. అలాగే జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది.

Share
D

Recent Posts