టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్స్ ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత ఎలక్ట్రిక్ SUV, టాటా పంచ్ మరియు ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్, టాటా టియాగో ధరలను తగ్గించడం జరిగింది. టాటా మోటార్స్ లో ఎంతో ఇన్నోవేటివ్ గా కొత్త రేంజ్ల తో ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు పండగ సీజన్ తో వాటి ధరలను తగ్గించి ఎంతో మంచి ఆఫర్ల తో పాటు క్యాష్ డిస్కౌంట్ ను ఇచ్చారు.
భారతదేశంలో టాటా పంచ్ ఈవీ ధరను ఎంతో డిస్కౌంట్ తో ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సిట్రోయన్ ఈసిత్రీ కు కాంపిటేటర్ అని చెప్పవచ్చు. అయితే ఆ మోడల్ కు కూడా 20,000 వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాక కార్పొరేట్ డిస్కౌంట్ గా 6000 వరకు ఇచ్చారు. ఈ ఆఫర్ 2023 మాత్రమే కాకుండా 2024 మోడల్స్ కు కూడా ఇవ్వడం జరిగింది.
టాటా పంచ్ ఈవీను స్టార్టింగ్ ధర 10.99 లక్షలకు విడుదల చేశారు. తర్వాత ఆ కార్ ధర లక్ష రూపాయలకు వచ్చింది. అయితే ప్రస్తుతం పండగ ఆఫర్లలో 9.99 లక్షలకు ఈ కార్ ధరను ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ రేంజ్ కార్ 25 kwh మరియు 35 kwh బ్యాటరీ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ మోడల్ తో పాటు టాటా టియాగో ఈవీ రేంజ్ కి కూడా మంచి ఆఫర్లను ఇచ్చారు.