వినోదం

Private Jet : సొంతంగా విమానాలు ఉన్న తెలుగు హీరోలు ఎవ‌రో తెలుసా.. ఒక్కో విమానం ఎంత రేటు ఉంటుందంటే..?

Private Jet : సెల‌బ్రిటీల లైఫ్ చాలా ల‌గ్జ‌రీగా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. వారు వేసుకునే బ‌ట్ట‌లు తినే తిండి, ఉండే ఇళ్లు అన్ని చాలా ల‌గ్జ‌రియ‌స్‌గా ఉంటాయి. ఇక వారు ప్రయాణించే కార్ల‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ హీరోలుగా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్న కొంద‌రు హీరోల కార్లు కోట్ల‌లోనే ఉంటాయి. ఇక కొంద‌రు టాప్ హీరోలు అయితే ప్ర‌త్యేకంగా ప్రైవేట్ జెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీకి సొంతంగా ఓ ప్రైవేట్‌ జెట్‌ విమానం ఉంది. దీన్ని ఎక్కువగా రామ్‌చరణ్‌ వాడుతుంటారు. వెకేష‌న్స్‌కి వెళ్లిన‌ప్పుడ‌ల్లా రామ్ చ‌ర‌ణ్ ఇదే వాడుతాడు. ఆ మధ్య నిహారిక మ్యారేజ్‌కి కూడా వాళ్లు తమ సొంత జెట్‌లోనే ఉదయ్‌ పూర్‌కి వెళ్లారు.

అల్లు అర్జున్‌ కి కూడా సొంతంగా జెట్‌ ఫ్లైట్‌ ఉంది. ప‌లు సంద‌ర్భాల‌లో ఆయ‌న త‌న జెట్ ముందు ఫొటోలు దిగారు. ప్ర‌యాణం స‌మ‌యంలోను ఫోటోలు దిగి వాటికి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు .అక్కినేని హీరోలకు కూడా సొంతంగా జెట్‌ ఫ్లైట్‌ ఉంది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ కలిసి చాలా సందర్భాల్లో ఈ విమానంలో ప్రయాణించారు. పాన్‌ ఇండియాస్టార్‌ ప్రభాస్‌కి సొంతంగా ఓ విమానం ఉంది. బాహుబలి తర్వాత దీన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఆయన ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ దిగిన ఫోటోలు అప్ప‌ట్లో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.

telugu actors who have own private jets

ఇక టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న మ‌హేష్ బాబుకి కూడా ప్రైవేట్ జెట్ ఉంది. ఎక్కువ‌గా విహార యాత్ర‌ల‌కు వెళ్లే మహేష్‌ ఈ జెట్‌నే ఎక్క‌వ‌గా వాడుతుంటారని సమాచారం. పలు మార్లు నమ్రత ఈ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. ఇక నంద‌మూరి స్టార్ హీరో ఎన్టీఆర్‌కి కూడా ప్రైవేట్ జెట్ ఉంద‌ని, దాని విలువ రూ.80 కోట్లు అని స‌మాచారం. విజయ్‌ దేవరకొండ కూడా ఓ ప్రైవేట్‌ జెట్‌ని కొన్నాడ‌ని టాక్‌. ఆయన ఇటీవల జెట్‌లో ప్రయాణించారు. ఇక హీరోయిన్స్‌లో న‌య‌న‌తార‌కి మాత్ర‌మే ప్రైవేట్ జెట్ ఉన్న‌ట్టు స‌మాచారం.

Admin

Recent Posts