వినోదం

Tollywood : టాలీవుడ్‌లో అత్య‌ధిక బ‌డ్జెట్ అయిన సినిమాలు ఇవి.. ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

Tollywood : సాధార‌ణంగా ఒక‌ప్పుడు తెలుగు సినిమాలు అంటే.. ఆరు పాట‌లు, రెండు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్‌.. ఇలా సాగేవి. కానీ రాజ‌మౌళి రాక‌తో తెలుగు సినిమాల‌కు అర్థ‌మే మారిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న సినిమాలు అంత‌ర్జాతీయ స్థాయిలో పేరుగాంచాయి. దీంతో ఆయ‌న ఎంతో ఖ్యాతిని గ‌డించ‌డ‌మే కాక‌.. పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తూ అల‌రిస్తున్నారు. బాహుబ‌లి 2 మూవీకి రూ.1900 కోట్లు వచ్చాయంటే రాజ‌మౌళి ప్ర‌తిభ ఎంత‌టిదో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

రూ.1000 కోట్ల‌ను ఒక సినిమా క‌లెక్ట్ చేస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. కానీ దాన్ని రాజ‌మౌళి చేసి చూపించారు. ఇక ఆయ‌న సినిమాల‌కు బ‌డ్జెట్ కూడా అధికంగానే అవుతుంటుంది. ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి సినిమా అంటే హిట్ ప‌క్కా క‌నుక నిర్మాతలు ఎంత మొత్త‌మైనా చెల్లించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక రాజమౌళి మాత్ర‌మే కాకుండా ఇత‌ర ద‌ర్శ‌కులు కూడా తెలుగులో భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక బ‌డ్జెట్ అయిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

these are the high budget movies in tollywood

రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను మహేష్ బాబుతో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా ఈ సినిమాకు గాను రూ.800 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. అలాగే ప్రభాస్ క‌ల్కి సినిమాకు రూ.600 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ అయింది. ఆర్ఆర్ఆర్ మూవీ బ‌డ్జెట్ రూ.550 కోట్లు అయింది. పుష్ప సినిమా అత్యధిక స్థాయిలో ప్రేక్షకుల మనసును దోచుకుని హిట్ అయింది. పుష్ప 2 సినిమాకి గాను దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్ అయింది.

ప్రభాస్ నటించిన సాహో సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమాకు రూ.350 కోట్ల బడ్జెట్ అయింది. అలాగే రాధేశ్యామ్ కు రూ.300 కోట్లు, సైరా నరసింహా రెడ్డికి రూ.300 కోట్లు, బాహుబలి 2 కి రూ.250 కోట్లు బ‌డ్జెట్ అవ‌గా.. సలార్ కు రూ.200 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇక పుష్ప మొద‌టి పార్ట్‌కు రూ.200 కోట్ల వ‌ర‌కు అయింది.

Admin

Recent Posts