ఆధ్యాత్మికం

Lakshmi Devi : నిత్య ద‌రిద్రానికి ఇవే కార‌ణాలు.. ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Lakshmi Devi : జీవితంలో ఎంత పైకి రావాలన్నా, కొందరు రాలేకపోతుంటారు. ధనవంతులు అవ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. అయినా కూడా అన్ని ప్రయత్నాలు విఫలం అయిపోతాయి తప్ప, ఫలితం ఏమీ ఉండదు. నిత్య దరిద్ర కారణాలు అయితే ఇవి. మరి ఈసారి ఈ తప్పులు చేయకుండా చూడండి. ధనవంతులు అయిపోతారు. రోజు వాడే మంచం, పక్క బట్టలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మంచాన్ని ఉదయం మాత్రమే, శుభ్రపరచుకోవాలి. రాత్రిళ్ళు శుభ్రపరచడం వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.

అలానే, బాత్రూమ్ ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూం శుభ్రంగా లేకపోతే దరిద్రం పట్టుకుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొంతమంది ఎక్కువ ఆహారాన్ని పెట్టుకొని, వదిలేస్తూ ఉంటారు. అలా ఆహారాన్ని పారేయడం వలన దరిద్రం ఉంటుంది. ఇంటికి ఉత్తరం వైపు నల్లటి వస్తువులు ఉండటం వలన నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ ఉమ్ము వేయకూడదు. అలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. దరిద్రం తాండవిస్తుంది.

these are the reasons for poverty

శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సంధ్యా వేళలో ఇల్లు తుడవకూడదు. ఇలా చేయడం వలన కూడా దరిద్రం పట్టుకుంటుంది. మద్యపానీయాలు ఇంట్లో పెట్టకూడదు. లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏదైనా వ్యాపారం లేదా పెట్టుబడి విషయంలో భార్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. భర్త బయటకు వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు.. మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది అడగకూడదు. పనిలో ఆటంకం కలుగుతుంది.

బయట నుండి ఏ విధంగా అయినా డబ్బులు వస్తే, మీ భార్య చేతికి ఇచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోవాలి. వయసులో ఉన్న ఆడపిల్లలు కచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. అలానే గాజులు వేసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుందట. ఇలా వీటిని పాటించినట్లయితే, దరిద్రం వంటి బాధలు ఏమీ ఉండవు. ఆనందంగా ఉండొచ్చు.

Admin

Recent Posts