ఆధ్యాత్మికం

ఈ సంకేతాలు క‌నిపిస్తున్నాయా.. అయితే ల‌క్ష్మీ క‌టాక్షం క‌ల‌గ‌బోతుంద‌ని అర్థం..!

డబ్బు లేకపోతే ఏదీ లేదు. డబ్బు ఉంటేనే ఏదైనా సరే. ఒక మనిషికి డబ్బులు లేకపోతే కష్టాలు, దుఃఖం, ఆకలి ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆపదలు, అవసరాలు తొలగిపోవాలన్నా.. ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా ముఖ్యమైనది. చాలామంది డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. పేదరికంతో ఇబ్బంది పడేవాళ్లు చాలామంది ఉన్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం అందరికీ సాధ్యం కాదు. కష్టపడి పని చేసినప్పటికీ చాలా మంది ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండదు. అయితే మహాలక్ష్మి దేవిని పూజిస్తూ ఉంటే కచ్చితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది.

పైగా అమ్మవారికి ఇష్టమైన కొన్ని పనులను చేస్తే మీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి, శుభ్రంగా వాకిలి ఊడ్చి ముగ్గుని పెట్టాలి. ఇంటి ముందు వాకిలిలో ముగ్గు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలానే ఎప్పుడు ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవికి ఇల్లు అందంగా, శుభ్రంగా ఉంటే ఇష్టం. అలానే నిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి. తులసి కోట కూడా ఇంట్లో తప్పకుండా ఉండాలి. తులసి కోట ముందు కూడా రోజు దీపం పెట్టాలి. అప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంటి నిలుస్తుంది.

these signs show that soon you will have money

ఇంట్లో పిల్లలను బాగా కొట్టడం, భార్యాభర్తల గొడవ పడడం వంటివి చేయకూడదు. ఇటువంటివి లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. ఇంటి గుమ్మం నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మొక్క కనపడాలి. ఇలా ఉన్నట్లయితే ఆ ఇంట కచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది, ఇవన్నీ ఎల్లప్పుడూ పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందా లేదా అనేది కూడా ఇలా చెప్పొచ్చు.

మధ్యాహ్నం సమయంలో కోయిల కూత వినపడితే అది శుభం. మామిడి చెట్టు మీద ఉండి కోకిల కూస్తున్నట్లయితే, లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతోందని దానికి సంకేతం. బల్లి కుడి భుజం మీద కానీ ఎడమ భుజం మీద కానీ పడిందంటే, మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే అది శుభసంకేతం, ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. రెండు తలల పాము ఇంట్లో కనబడితే కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని దానికి అర్థం.

Admin

Recent Posts