Thotakura Curry : తోట‌కూర అంటే ఇష్టం లేదా.. ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే మొత్తం లాగించేస్తారు..!

Thotakura Curry : మ‌నం తోట‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వైద్యులు కూడా దీనిని ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. తోట‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో తోటకూర క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ తోట‌కూర క‌ర్రీ మ‌న‌కు ఎక్కువ‌గా క‌ర్రీ పాయింట్ ల‌లో ల‌భిస్తూ ఉంటుంది. దీనిని మ‌నం అంతే రుచితో ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌ర్రీ పాయింట్ స్టైల్ లో తోట‌కూర కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తోట‌కూర కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ధ్య‌స్థంగా ఉన్న తోట‌కూర క‌ట్ట‌లు – 3, ప‌చ్చిమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నూనె – 3 టీ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, చిన్న ముక్క‌లుగా త‌రిగిన ట‌మాటాలు – 3, కారం – అర టీ స్పూన్ లేదా త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్.

Thotakura Curry recipe in telugu very tasty easy to make
Thotakura Curry

తోట‌కూర క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా తోట‌కూర‌ను చిన్న‌గా త‌రిగి శుభ్రంగా క‌డిగి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత తోట‌కూర వేసి క‌ల‌పాలి. దీనిని చిన్న మంట‌పై అంతా క‌లిసేలా క‌లిపిన త‌రువాత మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి ట‌మాట ముక్కలు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తోట‌కూర క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తోట‌కూర‌ను తిన‌ని వారు కూడా దీనిని ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts