Palak Vada : పాల‌కూర‌తో ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Palak Vada : పాల‌కూర‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌కూరలో కూడా ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పాల‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం కూర‌లే కాకుండా దీనితో మ‌నం వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాల‌కూర‌తో చేసే ఈ వ‌డ‌లు రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. పాల‌కూర‌తో రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా పాల‌క్ వ‌డ‌లను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌క్ వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన పాల‌కూర – 2 క‌ప్పులు, ప‌చ్చిమిర్చి – 3, అల్లం – అర ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, వాము – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, కారం – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, ప‌సుపు -పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Palak Vada recipe in telugu make in this method
Palak Vada

పాల‌క్ వ‌డ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, వాము, జీల‌క‌ర్ర వేసి క‌చ్చా ప‌చ్చ‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో పాల‌కూర‌, ఉల్లిపాయ ముక్క‌, కారం, ధ‌నియాల పొడి, ప‌సుపు, రెండు టీ స్పూన్ ల‌నూనె వేసి క‌ల‌పాలి. పాల‌కూర‌లో ఉండే నీరు బ‌య‌ట‌కు వ‌చ్చేలా న‌లుపుతూ క‌ల‌పాలి. త‌రువాత బియ్యం పిండి, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు కొద్దిగా శ‌న‌గ‌పిండి వేస్తూ క‌ల‌పాలి. దీనిని ముద్ద‌లాగా చేసిన త‌రువాత చేతికి నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వ‌డ‌ల ఆకారంలో వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక వ‌డ‌ల‌ను వేసి కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ వ‌డ‌లు త‌యార‌వుతాయి. ట‌మాట కిచ‌ప్ తో తింటే ఇవి మరింత రుచిగా ఉంటాయి. పాల‌కూర‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ వ‌డ‌ల‌ను ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts