Tilapia Fish Fry : తిలాపియా చేపలు.. మనం ఆహారంగా తీసుకునే చేపలల్లో ఇది కూడా ఒకటి. ఈ చేపలు చిన్నగా ఉంటాయి. వీటితో ఎక్కువగా ఫ్రై చేసి తీసుకుంటూ ఉంటారు. తిలిపియా చేపలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. తిలాపియా చేపలతో ఫ్రై చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సైడ్ డిష్ గా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ ఫ్రైను తయారు చేసుకోవడం చాలా సులభం. తిలాపియా చేపలతో ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిలాపియా చేప వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
తిలాపియా చేపలు – 2, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, నూనె – ఒక టేబుల్ స్పూన్.
తిలాపియా చేప వేపుడు తయారీ విధానం..
ముందుగా తిలిపియా చేపలను తల, తోక, పైన ఉండే చర్మం తీసేసి పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. తరువాత వీటిపై గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కారంతో పాటు మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను చేపలకు పట్టించి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో పావు కప్పు నూనె పోసి వేడి చేయాలి. తరువాత చేపలను వేయించాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తిలాపియా చేపల ఫ్రై తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చేపల ప్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.