Tomato Chicken : ట‌మాటాల‌ను దిట్టంగా వేసి ఇలా చికెన్ వండండి.. మొత్తం తినేస్తారు..!

Tomato Chicken : మాంసాహార ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, తేలిక‌గా చేసుకోద‌గిన చికెన్ వంట‌కాల్లో ట‌మాట చికెన్ కూడా ఒక‌టి. ట‌మాటాలు వేసి చేసే ఈ చికెన్ కారంగా, ట‌మాట రుచి త‌గులుతూ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ట‌మాట చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 1/3 క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఆవాలు – ఒక‌ టీ స్పూన్, పెద్ద ముక్క‌లుగా తరిగిన టమాటాలు – 2, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ట‌మాటాలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, గంట‌పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ – అర‌కిలో, నీళ్లు – 250 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Chicken recipe in telugu very tasty easy to cook
Tomato Chicken

ట‌మాట చికెన్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఇందులో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి.వీటిని గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీగా చేసి వేసుకోవాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. తరువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి.

ఇప్పుడు చికెన్ వేసి 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు చికెన్ పై మూత ఉంచి చిన్న మంట‌పై 20 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఇందులో వేయించిన ట‌మాట ముక్క‌లు వేసి మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట చికెన్ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, బ‌గారా అన్నం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే చికెన్ క‌ర్రీ కంటే ఈ విధంగా ట‌మాటాలు వేసి చేసే చికెన్ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts