Tomato Karivepaku Pachadi : ట‌మాటా క‌రివేపాకు ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Karivepaku Pachadi : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చ‌చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అన్నంతో, అల్పాహారాల‌తో తీసుకోవ‌డానికి ఈ ప‌చ్చ‌ళ్లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. ట‌మాటాలతో మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ట‌మాట క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ట‌మాటాలు, క‌రివేపాకు క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ట‌మాట క‌రివేపాకు ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్స్, నువ్వులు- 2 టీ స్పూన్స్, ప‌చ్చికొబ్బ‌రి తురుము – అర క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 10 నుండి 15, నాటు క‌రివేపాకు – 75 గ్రా., నాటు ట‌మాటాలు – 300 గ్రా., ఉప్పు – త‌గినంత‌.

Tomato Karivepaku Pachadi make like this for taste
Tomato Karivepaku Pachadi

ట‌మాట క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు వేగిన త‌రువాత ప‌చ్చికొబ్బ‌రి తురుము వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి మ‌గ్గించాలి. ప‌చ్చిమిర్చి వేగిన త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. క‌రివేపాకు మ‌గ్గిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి.త‌రువాత అదే క‌ళాయిలో మ‌రో టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ట‌మాట ముక్క‌లు చ‌ల్లారిన త‌రువాత జార్ ను తీసుకుని అందులోముందుగా వేయించి ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ప‌చ్చ‌డిలో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts