Vankaya Pappu Charu : వంకాయ‌ల‌తో ప‌ప్పు చారు చేస్తే.. టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా.. ఆహా.. అంటారు..

Vankaya Pappu Charu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వంకాయల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. అలాగే వంకాయ‌లు కూడా ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఈ వంకాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌ప్పు చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వంకాయ‌ల‌తో చేసే ఈ ప‌ప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టి సారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని స‌లుభంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో ప‌ప్పుచారును ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ ప‌ప్పు చారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..
కందిప‌ప్పు – 100 గ్రా., చిన్న ముక్క‌లుగా త‌రిగిన వంకాయ‌లు – 4, ప‌సుపు – అర టీ స్పూన్, నీళ్లు – 4 గ్లాసులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాట – 1, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, కారం – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Vankaya Pappu Charu recipe in telugu very tasty easy to cook
Vankaya Pappu Charu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

వంకాయ ప‌ప్పుచారు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత దానిలో ఒక గ్లాస్ నీళ్లు, ఒక టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ ప‌సుపు వేయాలి. త‌రువాత కుక్క‌ర్ పై మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 3 విజిల్స్ వచ్చే వ‌ర‌కు ప‌ప్పును ఉడికించాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గం వేగిన త‌రువాత వంకాయ ముక్క‌లు వేసి వేయించాలి. వంకాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత ఉడికించిన ప‌ప్పును వేయాలి. త‌రువాత నీళ్లు, ఉప్పు, కారం, క‌రివేపాకు, చింత‌పండు ర‌సం వేసి క‌ల‌పాలి. ఈ ప‌ప్పుచారును 15 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న ప‌ప్పు చారును వేసి క‌ల‌పాలి. ఈ ప‌ప్పుచారును మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ ప‌ప్పు చారు త‌యార‌వుతుంది. ఈ ప‌ప్పుచారును వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ప‌ప్పు చారును కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts