Vankaya Ulli Karam Kura : వంకాయ‌ల‌ను ఇలా ఎప్పుడైనా కూర‌లా చేసి తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Vankaya Ulli Karam Kura : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో వంకాయ ఉల్లికారం కూడా ఒక‌టి. వంకాయ‌ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఒక్క వంకాయ‌ను కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉండే వంకాయ ఉల్లికారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ ఉల్లికారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గుత్తి వంకాయ‌లు – 400 గ్రాములు., పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయలు – 3 ( పెద్ద‌వి), జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – పావు క‌ప్పు, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4.

Vankaya Ulli Karam Kura recipe in telugu tasty dish easy to cook
Vankaya Ulli Karam Kura

వంకాయ ఉల్లికారం త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను నాలుగు ప‌చ్చాలుగా క‌ట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. త‌రువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు, జీల‌క‌ర్ర‌, అల్లం, కారం, ఉప్పు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌ట్ చేసుకున్న వంకాయ‌ల‌ను వేసి వేయించుకోవాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ స‌గానికి పైగా వేయించుకోవాలి. వంకాయ‌లు వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కో వంకాయ‌ను తీసుకుని వాటి మ‌ధ్య‌లో ముందుగా త‌యారు చేసుకున్న ఉల్లికారాన్ని స్ట‌ఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక స్ట‌ఫ్ చేసుకున్న వంకాయ‌ల‌తో పాటు మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసి నెమ్మ‌దిగా క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ 15 నిమిషాల పాటు వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ ఉల్లికారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయ ఉల్లికారాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వంకాయ‌లతో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఉల్లికారాన్ని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts