Vastu Plants : సాధారణంగా చాలా మంది ఇళ్లలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కొందరికి కుటుంబ సమస్యలు ఉంటే కొందరికి డబ్బు సమస్యలు, ఇంకొందరికి వ్యాపారం, విద్య, ఉద్యోగం.. ఇలా చాలా మందికి అనేక సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమస్యలకు చాలా వరకు వాస్తు దోషాలే కారణం అవుతుంటాయి. మనం తెలిసో తెలియకో చేసే తప్పులు వాస్తు దోషాలకు కారణమవుతుంటాయి. అవే మనకు సమస్యలను తెచ్చి పెడుతుంటాయి. దీంతోపాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పోయి నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఫలితంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండదు. కుటుంబ సభ్యులు లేదా దంపతుల మధ్య ఎల్లప్పుడూ గొడవలు, చీటికీ మాటికీ మనస్ఫర్థలు వస్తూనే ఉంటాయి. వీటన్నింటికీ వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీనే ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పబోయే మొక్కలను మనం ఇంట్లో పెంచితే వాస్తు దోషాలను తొలగించుకోవచ్చు. దీంతోపాటు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సమస్యలు పోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. ఇక అందుకు ఎలాంటి మొక్కలను పెంచాలో ఇప్పుడు చూద్దాం.
చాలా మందికి మనీ ప్లాంట్ మొక్క గురించి తెలిసే ఉంటుంది. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల డబ్బును ఆకర్షిస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ మొక్కను పెంచాలి. దీన్ని ఇంట్లో ఆగ్నేయం దిశలో ఉంచితే బాగుంటుంది. మనీ ప్లాంట్ ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూడాలి. ఇది మీకుండే డబ్బు సమస్యలను పోగొడుతుంది. అలాగే పీస్ లిల్లీ అనే మొక్కను ఇంట్లో పెంచితే ఇంట్లో కుటుంబ సభ్యులు లేదా దంపతుల మధ్య ఉండే సమస్యలు పోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. కష్టాలు పోతాయి.
ఇంట్లో స్నేక్ ప్లాంట్ అనే మొక్కను పెంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇది ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది కనుక దీన్ని పెంచితే ఒత్తిడి తగ్గుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. ప్రశాంతంగా నిద్ర పోతారు. అలాగే ఇంట్లో తులసి మొక్కను పెంచడం వల్ల కష్టాల నుంచి గట్టెక్కుతారు. సమస్యలు తొలగిపోతాయి. దీంతోపాటు ఇంట్లో లక్కీ బాంబూ, అలోవెరా, మల్లె మొక్కలను కూడా పెంచవచ్చు. ఇవన్నీ ఇంట్లో ఉండే వాస్తు దోషాలను తొలగిస్తాయి. నెగెటివ్ ఎనర్జీని పారదోలుతాయి. పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. దీంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.