AC Power Bill Saving Tips : రోజంతా ఏసీ ఆన్ చేసి ఉంచాలంటే క‌రెంటు బిల్లు భ‌య‌పెడుతుందా.. ఇలా చేస్తే చాలు..!

AC Power Bill Saving Tips : ప్ర‌స్తుత త‌రుణంలో ఎండ‌లు ఎలా ఉన్నాయో అంద‌రికీ తెలిసిందే. జనాలు విపరీత‌మైన వేడి, వ‌డ‌గాలుల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో ఇంటికే ప‌రిమితం కావ‌ల్సి వ‌స్తోంది. అయితే ఇంట్లో ఉండాలంటే కూల‌ర్ లేదా ఏసీ ఉండాలి. కానీ కూల‌ర్ క‌న్నా ఏసీల వైపే చాలా మొగ్గు చూపుతున్నారు. అయితే ఏసీ కొన‌డం, ఇన్‌స్టాల్ చేయించ‌డం వ‌ర‌కు బాగానే ఉంది. కానీ త‌రువాత వ‌చ్చే బిల్ క‌ట్టాలంటేనే చాలా మంది జంకుతుంటారు. దీంతో ఏసీని రాత్రి పూట 1 లేదా 2 గంట‌ల పాటు మాత్ర‌మే ఆన్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను పాటిస్తే రోజంతా ఏసీని ఎంచ‌క్కా ఆన్‌లోనే ఉంచుకోవ‌చ్చు. దీంతో బిల్ బాగా వ‌స్తుంద‌నే టెన్ష‌న్ కూడా అవ‌స‌రం లేదు. ఇక ఏసీల‌కు వచ్చే క‌రెంటు బిల్లును త‌గ్గించాలంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్ కండిషనర్‌ల‌లో చాలా మోడ్‌లు ఉంటాయి. వీటిలో దాదాపు అన్ని రకాల ఏసీలలో డ్రై మోడ్, హీట్ మోడ్, స్లీప్ మోడ్, కూల్ మోడ్, ఆటో మోడ్‌లు ఉంటాయి. ఈ మోడ్‌లన్నీ వివిధ పరిస్థితులు, వాతావరణానికి అనుగుణంగా సెట్ చేయబడి ఉంటాయి. ఈ మోడ్‌లను సక్రమంగా ఉపయోగిస్తే ఏసీ జీవితకాలం పెరుగుతుంది. దీంతో కరెంటు బిల్లు కూడా తక్కువ‌గానే వ‌స్తుంది. ఇక మీరు మీ ఏసీని ఆటో మోడ్‌లో సెట్ చేసిన వెంటనే, ఏసీ డ్రై మోడ్, కూల్ మోడ్, హీట్ మోడ్ కూడా ఆన్ అవుతుందని ఈ మోడ్ మీకు తెలియజేస్తుంది. ఏసీ ఆటో మోడ్ స్వయంచాలకంగా ఉష్ణోగ్రత ప్రకారం వేగం, శీతలీకరణను నిర్వహిస్తుంది.

AC Power Bill Saving Tips follow these for better temperature controlAC Power Bill Saving Tips follow these for better temperature control
AC Power Bill Saving Tips

ఏసీ ఆటో మోడ్ లో ఏసీ ఫ్యాన్ ఎప్పుడు రన్ అవుతుంది. కంప్రెసర్ ఎప్పుడు ఆన్‌లో ఉంటుంది. ఈ మోడ్ గది ఉష్ణోగ్రతను నిరంతరం పర్యవేక్షిస్తుంది. తదనుగుణంగా ఏసీ సెట్టింగ్‌లను సర్దుబాటు చేస్తుంది. గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ఎయిర్ కండిషనర్ ఆటో మోడ్ కంప్రెసర్‌ను ఆన్ చేస్తుంది. గది కూల్ అయినప్పుడు, కంప్రెసర్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా, గది గాలిలో తేమ ఉన్నప్పుడు, ఏసీ ఆటో మోడ్ డీహ్యూమిడిఫికేషన్ మోడ్‌ను ఆన్‌ చేస్తుంది. ఏసీ ఆటో మోడ్ ఏసీని నిరంతరం ఆన్ చేయదు. గ‌ది ఉష్ణోగ్ర‌త పెరిగిన‌ప్పుడు మాత్ర‌మే ఏసీ ఆన్ అవుతుంది. చ‌ల్ల‌బ‌డ‌గానే ఏసీ ఆఫ్ అవుతుంది. ఇలా ఏసీని రోజంతా ఆన్‌లో ఉంచినా పెద్ద‌గా క‌రెంటు బిల్లు రాదు. దీంతో ఏసీని వాడుతూనే త‌క్కువ‌గా క‌రెంటు బిల్లు వ‌చ్చేలా చూసుకోవ‌చ్చు.

Editor

Recent Posts