Veg Khuska Pulao : వెజ్ ఖుస్కా పులావ్‌ను ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Veg Khuska Pulao : వెజ్ ఖుస్కా పులావ్.. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఈ పులావ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ పులావ్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం.వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌టి వాస‌న‌తో ఉండే ఈ వెజ్ ఖుస్కా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ ఖుస్కా పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 4, అనాస పువ్వు – 1, జాజికాయ – పావు ఇంచు కంటే కొద్దిగా త‌క్కువ‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీస్పూన్, తరిగిన ట‌మాటాలు – 2, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, పెరుగు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – అర క‌ట్ట‌, త‌రిగిన పుదీనా – ఒక‌చిన్న క‌ట్ట‌, గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు.

Veg Khuska Pulao recipe very tasty easy to make
Veg Khuska Pulao

వెజ్ ఖుస్కా పులావ్ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర‌, సోంపు గింజ‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత గ‌రం మ‌సాలా, ఉప్పు వేసి క‌ల‌పాలి.

త‌రువాత పెరుగు వేసి క‌లపాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి క‌లాలి. త‌రువాత బియ్యం వేసి రెండు నిమిషాల పాటు పెద్ద మంట‌పై క‌లుపుతూ వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి పెద్ద మంట‌పై ఒక విజిల్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత అంతా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఖుస్కా పులావ్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన వెజ్ ఖుస్కా పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts