వినోదం

Vega Thamothia : దేవీ పుత్రుడు చిన్నారి గుర్తుందా.. ఈమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాకవుతారు..!

Vega Thamothia : కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి, సురేష్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన దేవీ పుత్రుడు మూవీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. గ్రాఫిక్స్ వల్ల మూవీకి హైప్‌ వచ్చింది. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం నిరాశ పరిచింది. అయితే ఇందులో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన పాపకు మాత్రం ఎంతో పేరు వచ్చింది. సాధారణంగా బాలనటిగా చేస్తే.. తరువాత అవకాశాలు కూడా బాగానే వస్తాయి. కానీ ఈమె మాత్రం సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు ఈమె చాలా మారిపోయింది.

దేవీ పుత్రుడు సినిమా కథ అద్భుతంగా ఉంటుంది. నీట మునిగిన ద్వారకా నగరాన్ని కనుగొనడం, పవర్ బాక్స్‌.. వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక వెంకటేష్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా.. మరొకరు దొంగగా నటించారు. అయితే ప్రభుత్వ అధికారి పాత్రలో నటించిన వెంకటేష్‌కు సౌందర్య భార్య. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు చంపేస్తారు. దీంతో ఆమె కడుపులో ఉండే శిశువు కూడా చనిపోతుంది.

Vega Thamothia do you know how she is now

అయితే ఆ శిశువు కాస్త పెద్దయ్యాక ఎలా ఉంటుందో ముందుగానే ఊహించి వెంకటేష్‌ ఒక చిత్రాన్ని గీస్తాడు. అయితే ఆ పాప చనిపోయాక అదే రూపంతో ఇంకో వెంకటేష్‌కు ఆత్మ రూపంలో కనిపిస్తుంది. ఇక ఆ పాప పాత్రలో నటించిన బాలనటి పేరు వేగా తమోతియా. ఈమె పేరు ఎవరికీ తెలియదు. కానీ దేవీ పుత్రుడు బాలనటి అంటే అందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇక ఈమె ఇప్పుడు చాలా మారిపోయింది.

దేవీ పుత్రుడు సినిమా ఫ్లాప్‌ అయినా.. తమోతియాకు మాత్రం మంచి పేరును తెచ్చి పెట్టింది. తనదైన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈమె అప్పట్లో ఎంతో మందిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆమెను చూస్తే అసలు గుర్తు పట్టలేం. అంతలా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈమె సోషల్‌ మీడియాలో తన ఫొటోలను షేర్‌ చేస్తోంది. వాటిని చూసిన నెటిజన్లు.. ఒకప్పటి దేవీ పుత్రుడు చిన్నారి ఈమెనేనా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Admin

Recent Posts