Vegetable Pulao Recipe : బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌.. ఎందులోకి అయినా స‌రే.. అదిరిపోయే వెజిట‌బుల్ పులావ్‌.. క్ష‌ణాల్లో ఇలా చేయండి..!

Vegetable Pulao Recipe : చికెన్,మ‌ట‌న్ వంటి మాంసాహార‌ల‌తోనే కాకుండా కూర‌గాయ ముక్క‌ల‌ను ఉప‌యోగించి మ‌నం వెజిటేబుల్ పులావ్ త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా కూర‌ల‌తో తిన‌డానికి ఈ పులావ్ చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా స‌లుభం. వెజిటేబుల్ పులావ్ ను రుచిగా, సులువుగా ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెజిటేబుల్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టుకున్న బియ్యం – 500 గ్రా., పెద్ద ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప – 1, ప‌చ్చిబ‌ఠాణీ – అర క‌ప్పు, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ట‌మాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌.

మ‌సాలా దినుసులు..

దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, బిర్యానీ ఆకులు – 2, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, సాజీరా – ఒక టీ స్పూన్.

Vegetable Pulao Recipe best for breakfast or lunch
Vegetable Pulao Recipe

వెటిటేబుల్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క్యారెట్ ముక్క‌లు, బంగాళాదుంప ముక్క‌లు, ప‌చ్చిబ‌ఠాణీ వేసి క‌ల‌పాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, పెరుగు కూడా వేసి క‌ల‌పాలి. వీటిపై మూత‌ను ఉంచి 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యాన్ని, కొత్తిమీర‌ను, పుదీనాను వేసి క‌ల‌పాలి. త‌రువాత నీటిని పోయాలి. ఒక గ్లాస్ బియ్యాన్నికి ఒక‌టిన్న‌ర గ్లాస్ మోతాదులో నీటిని పోయాలి. త‌రువాత త‌గినంత ఉప్పును వేసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి అన్నం ఉడుకు ప‌ట్టే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత అన్నాన్ని ఒక‌సారి కలిపి మంట‌ను చిన్న‌గా చేసి పూర్తిగా ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. స్ట‌వ్ ఆఫ్ చేసిన త‌రువాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో టేస్టీగా ఉండే వెటిటేబుల్ పులావ్ త‌యార‌వుతుంది. ఈ పులావ్ త‌యారీలో క్యాలీప్ల‌వ‌ర్, బీన్స్ వంటి ఇత‌ర కూర‌గాయ‌ల‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఏదైనా మ‌సాలా కూర‌తో క‌లిపి తింటే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts