Onions : ఉల్లిపాయలను నిత్యం మనం వంటల్లో ఉపయోగిస్తుంటాం. వీటిని వేస్తేనేగానీ కూరలకు రుచి రాదు. ఉల్లిపాయలను కొందరు పచ్చిగానే తింటుంటారు. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటి వాటితోపాటు నాన్‌వెజ్ వంటకాల్లో పచ్చి ఉల్లిపాయను కొరుక్కుని తింటుంటే వచ్చే మజాయే వేరు. అయితే ఉల్లిపాయతో కింద చెప్పిన విధంగా ఓ మిశ్రమాన్ని తయారు చేసుకుని తింటే అద్భుతమైన శృంగార శక్తి లభిస్తుంది.
పచ్చి ఉల్లిపాయ తెల్లది ఒకటి తీసుకోవాలి. దాన్ని పొట్టు తీసి దంచాలి. అందులో కొద్దిగా వెన్న కలిపి పెనంపై వేయించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని 2 టీస్పూన్ల మోతాదులో తీసుకుని అందులో అంతే మోతాదులో తేనె కలిపి ఉదయాన్నే పరగడుపునే సేవించాలి.
ఇలా పైన తెలిపిన విధంగా ఉల్లిపాయ మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ సేవిస్తే జననావయవాలు పటిష్టంగా మారుతాయి. ఆ అవయవాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. పురుషుల్లో శృంగార సమస్యలు పోతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
శృంగార కోర్కెలను పెంచడంలో ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల పైన చెప్పిన విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ తీసుకోవాలి.
ఇక రోజూ పచ్చి ఉల్లిపాయను 50 గ్రాముల మేర ఆహారంలో తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గడమే కాక షుగర్ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.