Viral Video : సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. ఇందులో చాలా మంది రోజూ విహరిస్తున్నారు. చాలా సమయం పాటు అందులో కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా అందులో వీడియోలను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా పలు పాటలకు కొందరు చేసే డ్యాన్స్‌లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కనుకనే చాలా మంది సోషల్ మీడియాలో ఎక్కువ సేపు కాలం గడుపుతున్నారు. ఇక అలాంటి వారి టేస్ట్‌లకు తగినట్లుగానే కొందరు వీడియోలు చేసి అందులో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోల కారణంగా కొందరు రాత్రి రాత్రే ఓవర్‌నైట్ స్టార్స్ అయిపోయారు. కొందరు మోడల్స్ కాగా.. కొందరు సింగర్లుగా, కొందరు హీరోయిన్లుగా మారారు. కనుక ఎవరిలో ఉండే టాలెంట్ వారికి ఉంటుంది కాబట్టి.. తమ టాలెంట్‌తో ఎలాగైనా సరే పైకి రావాలని చూస్తున్నారు. దీంతోపాటు భారీ స్థాయిలో ఫాలోవర్లను కూడా పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకనే చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో వారి వీడియోలకు బాగానే స్పందన లభిస్తోంది. ఇక డ్యాన్స్ వీడియోలకు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు.
చాలా మంది ప్రస్తుతం వీడియోలను చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఆదరణ దక్కించుకుంటున్నారు. సినిమాల్లోని పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తున్నారు. అలాగే ఓ ఆంటీ కూడా డ్యాన్స్ చేసింది. వెంకటేష్ సినిమాలోని ఓ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.