Naradishti Signs And Symptoms : అప్పుడప్పుడూ కొందరికి నరదిష్టి తగులుతూ ఉంటుంది. నరదృష్టి తగిలితే ఎలా గుర్తించొచ్చు..? నరదిష్టి తగిలిన వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది..? అనే విషయాన్ని తెలుసుకుందాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంట్లో చిన్న పిల్లలు లేదంటే పెద్దవాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు. అప్పుడు మన పెద్దవాళ్లు నర దిష్టి తగిలిందని చెప్తూ ఉంటారు. నిజంగానే నరదిష్టి ఉంటుందా..? ఒకవేళ ఉంటే ఎటువంటి లక్షణాలు నరదృష్టి తగిలిన వాళ్లకి కనపడతాయి అనేది చూద్దాం. ఎప్పుడైనా కూడా బారసాల, పేరు పెట్టడం, సీమంతం, పెళ్లి ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అందరి చూపు కూడా శుభకార్యం ఎవరిదైతే వాళ్ళ మీదే ఉంటుంది. ఉన్నతంగా ఎదిగినప్పుడు ఓర్వలేక, చెడు మనసుతో చెడుని కోరుకోవడం ద్వారా నరదిష్టి మన మీద పడుతుంది. అయితే మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు రకరకాల సంకేతాలు మనకి కనబడతాయి.
ఈర్ష్య, అసూయలతో కూడిన దృష్టి సోకినప్పుడు కూడా ఈ నరదృష్టి తగులుతుంది. నరదిష్టి తగిలితే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తలనొప్పి రావడం, కడుపునొప్పి, కడుపులో వికారంగా అనిపించడం, తల తిరగడం, తిన్నది సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం, వాంతులు, ఉన్నట్టుండి నీరసంగా ఉండడం ఇటువంటి లక్షణాలు నరదిష్టి తగిలిన వారిలో కనిపిస్తాయి. అదే పిల్లల్లో అయితే ఉన్నట్టుండి నిద్రలో ఉలిక్కిపడడం, ఎన్ని మందులు వేసినా నీరసంగా ఉండడం, చిన్నదానికి కూడా ఏడవడం, అనారోగ్య సమస్యలు.. ఇవి వాళ్లలో కనబడతాయి.
అయితే చాలా రకాలుగా దిష్టి తీస్తారు. ఉప్పుతో దిష్టి తీస్తారు. కర్పూరం బిళ్ళలతో, పిడకలతో, పేడ ముద్దతో, బొగ్గుతో, గుడ్డుతో ఇలా రకరకాలుగా దిష్టి తీస్తారు. దిష్టి పోవాలంటే నిమ్మకాయలతో ఇంటికి కానీ వ్యాపార సంస్థకి కానీ మూడు సార్లు.. కుడి నుండి ఎడమ వైపుకి తిప్పి, ఎడమ కాలితో కనుక నిమ్మకాయని తొక్కేసినా లేదంటే రోడ్డు మీద పడేసినా దిష్టి పూర్తిగా పోతుంది.