ఆధ్యాత్మికం

శనివారం ఇంట్లో బూజు దులిపి.. లక్ష్మీదేవికి లవంగం సమర్పిస్తే ?

సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే మన ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించినప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పవచ్చు. మరి మన ఇంట్లో లక్ష్మి కొలువై ఉండడానికి శనివారం రోజు ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

మనకు ధన ప్రాప్తి కలగాలంటే శనివారం ఇంట్లో బూజును దులపాలి. అదేవిధంగా మన ఇంట్లో ఏవైనా పగిలిపోయినా, లేదా పాడైపోయిన వస్తువులు ఉంటే వాటిని శనివారం రోజు మన ఇంట్లో నుంచి బయటపడేయాలి. ఈ విధంగా శనివారం ఇంట్లో ఉన్న పగిలిపోయిన వస్తువులను బయట వేయటం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం తెలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

what happens if you clean house and offer cloves to lakshmi devi

ఈ క్రమంలోనే శనివారం, శుక్రవారం లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి లవంగం సమర్పించడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. అదే విధంగా పూజ గదిలో ఎల్లప్పుడు ఏకాక్షి కొబ్బరికాయ ఉంచడం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో డబ్బును పొదుపు చేయాలని భావించేవారు భరణి నక్షత్రం నందు డబ్బులు పొదుపు చేయడం వల్ల ఇంట్లో డబ్బు వృధా కాకుండా పోగవుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts