ఆధ్యాత్మికం

Black Thread : కాలికి నల్ల దారం కట్టుకొంటే ఏం జరుగుతుంది..?

Black Thread : చాలామంది కాళ్ళకి నల్ల దారాన్ని కట్టుకుంటుంటారు. మీరు కూడా మీ కాళ్ళకి నల్ల దారాన్ని కడుతూ ఉంటారా.. అయితే చాలామంది దీనిని స్టైల్ కోసం ధరిస్తారు కానీ దీన్ని వెనక పెద్ద కారణమే ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు. నిజానికి కాలికి నల్లదారం కట్టుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే కారణాన్ని చూసేయండి.

దోషాల కారణంగా చాలామంది నల్లదారాన్ని కట్టుకుంటూ ఉంటారు నల్ల తాడుని కూడా కట్టుకుంటూ ఉంటారు. పిల్లలు చేతులకి కాళ్ళకి మెడ నడుము చుట్టూ కూడా నల్ల దారాన్ని కడుతూ ఉంటారు. కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శని దోషం నుండి బయట పడొచ్చు. నల్లదారాన్ని కట్టుకుంటే శని దోషం తగలదు. శని దోషం వలన ఇబ్బంది కలగకూడదంటే శనివారం నాడు కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే మంచిది.

what happens if you wear black thread

రాహువు కేతువుల బాధలు కూడా ఉండవు. శత్రు గ్రహం ఇంట్లోకి ప్రవేశించి మీ గృహ జీవితానికి ఆటంకం కలిగించవచ్చు. ఆర్ధిక సమస్యలు అప్పుడు కలుగుతాయి అలాంటప్పుడు మీరు ఎడమ కాలికి నల్లటి దారాన్ని కట్టుకుంటే రాహు కేతువుల ఆగ్రహం నుండి బయటపడొచ్చు. కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడొచ్చు. డబ్బు సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది. ఇంటికి మంచిని కలిగిస్తుంది.

లైఫ్ లో ఆర్థిక సమస్యలను మీరు ఎదుర్కొంటున్నట్లయితే కుడి కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. ఆర్థిక బాధల aనుండి బయటపడొచ్చు అలానే ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయ చిందితే నరదృష్టి తగులుతుంది అలాంటప్పుడు కూడా నల్లదారాన్ని కట్టుకోవడం మంచిది నర దిష్టికి నివారణగా పనిచేస్తుంది నల్లదారం. ఈ నల్ల దారాన్ని కనపడకుండా దాచుకోవాలి. దీన్ని కట్టినప్పుడు ఇతర రంగుల దారాలని కాళ్ళకి కట్టుకోకూడదు. మంగళవారం లేదంటే శనివారం నల్లదారాన్ని కాలికి కట్టుకోవడం మంచిది. నల్లదారాన్ని కట్టుకున్నట్టు 22 సార్లు శని మంత్రాన్ని జపిస్తే ఇంకా మంచి జరుగుతుంది.

Admin

Recent Posts