Dream : మనం నిద్రపోతున్నప్పుడు మనకు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. కలల అంతరార్థం ఏమిటో, వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఇప్పటి వరకు పూర్తిగా తెలియదు. కలల శాస్త్రీయ అధ్యయనాన్ని వనిరాలజీ అంటారు. మనకు వచ్చే కలలో ఏదో అంతరార్థం ఉంటుందని, కలల ద్వారా మన భవిష్యత్తును తెలుసుకోవచ్చని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. కలలను భౌతికంగా చూసినప్పుడు అవి నాడీ కణాల సంకేతాలు మాత్రమేనని పరిశోధకులు చెబుతున్నారు. మనస్తత్వ శాస్త్రం ద్వారా చూస్తే అవి అచేతనంలో జరిగే చలనాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు.
ఆధ్యాత్మికంగా చూస్తే దివ్య సందేశాలుగా, భవిష్యత్తును తెలిపే దూతలుగా చెప్పుకోవచ్చు. భావోద్వేగాలు, ఆందోళన, సంఘర్షణ కారణంగా పీడ కలలు సంభవిస్తాయి. మనిషి మేల్కొనే సమయాన్ని కలలు ఏ మాత్రం ప్రభావితం చేయవు. ప్రతి పది మందిలో ఒకరిని పీడ కలలు వెంటాడుతుంటాయి. మనకు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కలల్లో మనకు ఎవరెవరో కనబడుతూ ఉంటారు. కలలో ఎవరు కనిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కల వచ్చే సమయాన్ని బట్టి ఆ కల అర్థం మారిపోతూ ఉంటుంది. కొన్ని కలలు అర్థ రాత్రి వస్తాయి. కొన్ని తెల్లవారు జామున వస్తాయి. కొన్ని సూర్యోదయం తరువాత వస్తాయి. తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని చాలా మంది నమ్ముతారు. కలలో కనుక చనిపోయిన లేదా జీవించి ఉన్న తల్లిదండ్రులు కనిపిస్తే ఆ కల కన్న వారికి కచ్చితంగా ఏ పనిలో అయినా, ఏ ఆలోచనలో అయినా, ఏ తలంపులో అయినా విజయం వారిని వరిస్తుంది. వారు కల కన్న రోజు వారికి లక్ష్మీ దేవి కరుణాకటాక్షాలు నిండుగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా వారికి కలసి వస్తుంది.
తలిదండ్రులు కలలోకి రావడమనేది మన అదృష్టం. జీవించి ఉన్న తల్లిదండ్రులు మన కలలోకి వస్తే వారికి మన మీద అమితమైన ప్రేమ ఉన్నదని అర్థం. ఒకవేళ చనిపోయిన తల్లిదండ్రులు మన కలలోకి వస్తే వారికి మనల్ని విడిచి ఉండలేనంత ప్రేమ ఉందని అర్థం. వారు చనిపోయినా కూడా మన వెంటనే ఉన్నారని అర్థం. తల్లిదండ్రులు కనుక మన కలలోకి వస్తే మనకు విజయం కలుగుతుంది. తల్లిదండ్రుల వద్ద దొరికే ప్రేమ మరెక్కడా మనకు దొరకదు. కనుక వారు మన కలలోకి వస్తే మనకు ఎంతో మంచి జరుగుతుందని భావించాలి. తల్లిదండ్రులు కనక మన కలలోకి వస్తే వెంటనే లేచి భగవంతుడి నామస్మరణ చేసుకుని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ రోజంతా విజయం మన వెంటే ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీ దేవి కరుణాకటాక్షాలు కూడా మనతోనే ఉంటాయని పండితులు చెబుతున్నారు.