ఆధ్యాత్మికం

Naga Dosham : నాగ‌దోషం అంటే ఏమిటో తెలుసా.. ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

Naga Dosham : చాలామందికి నాగదోషం అంటే ఏంటో తెలియదు. నాగదోషం అంటే ఏంటి..? అని అడుగుతూ ఉంటారు. జాతకములో కాలసర్పదోషం ఉన్నవాళ్లు, పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములని చంపిన వాళ్ళు, వివిధ మంత్ర ఔషధములతో సర్పములని బంధించిన వారు, పాము పుట్టాలని తవ్విన వాళ్లకి నాగదోషం కలుగుతుంది. అలానే కొంతమంది పాము పుట్ట తవ్వి దాని మీద ఇల్లు కడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా నాగదోషం ఉంటుంది. జన్మజాతకమందు రాహువు, కేతువుల మధ్య గ్రహాలు ఉన్నా కూడా ఈ నాగదోషం ఉంటుంది. పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం అని అంటారు.

ఇక ఈ దోషం ఉంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయి..?, ఎలా ఈ దోష నివారణ చేసుకోవాలి అనే విషయాలను కూడా చూసేద్దాం… కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి వివాహం, సంతానం, కుటుంబం అభివృద్ధి, ఆరోగ్య విషయాల్లో ఎక్కువ ప్రభావం పడి, అనేక బాధల్ని చూస్తారు. ఎక్కువగా పెళ్లి ఆలస్యం అవుతుంది. సంతానం కలగరు. నాగ దోష నివారణకి శుక్ల చవితి, శుక్ల పంచమి, శుక్రవారం, ఆదివారం విశిష్టం. పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు అనుకూలంగా ఉంటాయి. అలానే కృష్ణ పక్షము నాగపూజకి అనువైనది.

what is naga dosham and how it affects

నాగ దోష నివారణ చేయించుకుంటే వంశాభివృద్ధి అవుతుంది. ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. జాతకచక్రంలో రాహువు లేదా కేతువు 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉంటే సర్ప దోషం ఉంటుంది. జాతకచక్రంలో రాహువు లేదా కేతువు లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ ఉండి శుభగ్రహ దృష్టి లేకపోతే కూడా పెళ్లిళ్లు ఆలస్యం అవ్వడం, బాధలు, తగాదాలు వంటివి జరుగుతాయి. పంచమ స్ధానంలో రాహువు లేదా కేతువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనట్టయితే, సంతానం ఆలస్యం అవుతుంది. లేదంటే సంతానం లేకపోవటం, అబార్షన్స్ అవడం లాంటివి జరుగుతాయి.

పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం. నివారణ కోసం నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే నివారణ కలుగుతుంది. జాతకచక్రంలో సప్తమ స్ధానంలో రాహువు లేదా కేతువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనట్టయితే బార్యా భర్తల మధ్య ఇబ్బందులు, గొడవలు వస్తాయి. అష్టమ స్ధానంలో రాహువు లేదా కేతువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేదంటే అనారోగ్య సమస్యలు, తిండి లేకపోవడం, పాము కలలు రావటం వంటివి జరుగుతాయి. ఇలా ఏదోకటి కలుగుతాయి కనుక దోష నివారణ చేసుకోవడం మంచిది.

Admin

Recent Posts