ఆధ్యాత్మికం

God Photos And Idols : ఇంట్లో పాడైపోయిన, విరిగిపోయిన దేవుళ్ల విగ్ర‌హాలు, ఫొటోలు ఉంటే.. ఏం చేయాలి..?

God Photos And Idols : ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఉంటుంది. చాలామందికి పూజకి సంబంధించిన విషయాలలో సందేహాలు ఉంటాయి. అటువంటి సందేహాలను తీర్చుకుంటే పాపం కలగకుండా సరిగ్గా పనిని పూర్తి చేయొచ్చు. చాలా మంది ఇళ్లల్లో పాత దేవుడు ఫోటోలు, పాడైపోయిన విగ్రహాలు వంటివి ఉంటాయి. వాటిని ఏం చేయాలో తెలీదు. ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. అటువంటప్పుడు వాటిని ఏం చేయాలి..? వాటిని పారేస్తే పాపం కదా.. మరి ఏం చేస్తే మంచిది అనే సందేహం చాలా మంది భక్తుల్లో ఉంది. మరి మీలో కూడా ఈ సందేహం ఉంటే వెంటనే తీర్చుకోండి.

కొంత మంది పాడైపోయిన విగ్రహాలని, దేవుడు ఫోటోలని దేవాలయంలో కానీ, రోడ్డుపక్క చెట్టు కింద కానీ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా చేయడం మహా పాపం. క్షమించరాని నేరమని చెప్పొచ్చు. ఇంట్లో ఉన్నంత వరకు రోజు పూజలు చేసి అందంగా దేవుడు పటాలని అలంకరిస్తారు. ఒకసారి పాడైపోయిన తర్వాత వాటిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు.

what to do with broken god idols and photos

అవసరం లేని వాటిని, పాడైపోయినవి, విరిగిపోయినవి అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచిది. అగ్నిలో వేయడం మంచిది కాదు కదా… అలా కాల్చేస్తారా అని ఆలోచించకండి.. అగ్ని సర్వభక్షకుడు. అన్నివేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలని సమర్పించడంలో తప్పు లేదు.

లేదు అంటే ప్రవహిస్తున్న నదిలో వాటిని వెయ్యొచ్చు. నిమజ్జనం చేయడం కూడా మంచి పద్ధతి. ఆ విగ్రహానికి మీరు నమస్కరించి.. గచ్చగచ్చ సుర శ్రేష్ట స్వస్థాన పరమేశ్వరా.. అని చెప్పి వదిలేయండి. ఇది కూడా నిమజ్జనమే. కాబట్టి మీరు ఈ పద్ధతుల్ని పాటించొచ్చు. అంతేకానీ దేవాలయాల్లో కానీ, చెట్టు కింద కానీ వదిలేసి వచ్చేయొద్దు.

Admin

Recent Posts