వినోదం

Suman : జైలులో ఉన్న‌ప్పుడు సుమన్‌కు అండగా ఉన్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

Suman : లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న అలనాటి హీరోలలో సుమన్ ఒకరు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడి ప్రేక్షకులలో మదిలో నిలిచిపోయారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నాడు. అంతే కాకుండా మంచి కట్ ఔట్, పొడవుగా అందంగా ఉండే ఈయన అనాటి అమ్మాయిల మనసు ఇట్టే దోచుకునేవారు. అలాగే అప్పుడు చాలా మందికి ఈయనే ఫేవరెట్‌ హీరో.

అయితే ఓ చాన‌ల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుమన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన పర్సనల్ ‌లైఫ్‌లోని కొన్ని మానని గాయలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. నీలి చిత్రాలు తెరకెక్కిస్తున్నారు అనే ఆరోపణలతో సుమన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందంట. అంతే కాకుండా ఆయన ఒక హీరోగా ఎంతో పేరు సంపాదించినా.. ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపాడ‌ట.

when suman in jail who helped him

కానీ ఆ సమయంలో ఎవరూ సహాయం చేస్తారు అనుకోలేదు కానీ, అనుకోని విధంగా ముగ్గురు హీరోయిన్లు నాకు అండగా నిలబడి, నాకు సహాయం చేశారని సుమన్ చెప్పుకొచ్చారు. వాళ్లు ఓ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ త‌న‌కు ప్లస్ అయ్యింద‌ని చెప్పారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరూ అనుకుంటున్నారా.. వారే సుమలత, సుహాసినితోపాటు మరో తమిళ హీరోయిన్ అంట. వీరు నేను జైల్లో ఉన్న సమయంలో చాలా సహాయం చేశారు. నా గురించి వారికి తెలుసు.. నాతో వారు చాలా సినిమాలలో నటించారు, నా వ్యక్తిత్వం ఎంలాంటిదో వారికి బాగా తెలుసు అంటూ సుమన్ ఇంటర్వ్యూలో తెలిపారు. అలా తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఓపెన్ అయ్యారు.

Admin

Recent Posts