తండ్రి ఆస్తి పై కూతురికి హక్కు ఉంటుందా..? అసలు లా ఏం చెప్తోంది..? ఎలాంటి రూల్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. హిందూ వారసత్వ చట్టం 1956 హిందువులు, బౌద్ధులు, జైన్, సిక్కులు మరియు పేగు లేదా ఇష్టం లేని వారసత్వానికి సంబంధించిన చట్టాన్ని సవరించడానికి క్రోడీకరించడానికి, లౌకికీకరించడానికి భారత పార్లమెంటు చట్టం వారసత్వం మరియు వారసత్వం యొక్క ఏకరితి అలాగే సమగ్ర వ్యవస్థను చట్టంగా నిర్దేశిస్తుంది. పూర్వికుల ఆస్తులపై ముందు కేవలం కొడుకులకి మాత్రమే హక్కు ఉండేది. తర్వాత కూతుర్లకి కూడా ఉందని చెప్పింది.
హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం కొడుకులతో పాటుగా కూతుర్లకు కూడా ఆస్తులపై సమాన హక్కు ని కల్పించేలా చేసింది. జెండర్ ఇనీక్వాలిటీస్ ని తొలగించింది. ఇప్పుడు కొడుకుకి, కూతురికి ఆస్తులపై సమాన హక్కుని తండ్రి ఆస్తిపై కల్పించింది. ఒకవేళ ఆమెకి వివాహమైనా, వివాహము అవ్వకపోయినా, విడాకులు తీసుకున్నా కూడా ఆమెకి హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది.
పూర్వికులు లేదా సొంత ప్రాపర్టీ అయితే.. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అయినా లేదంటే తండ్రి సొంత ఆస్తి పైన అయినా కూతురికి కూడా సమాన హక్కు ఉంటుంది. వీలునామా లేని ఆస్తులు గురించి చూస్తే.. వీలునామా రాయకుండా తండ్రి చనిపోతే కూతురికి, కొడుకుకి సమాన హక్కు ఆస్తిపై ఉంటుంది. ఒకవేళ కనుక కూతురుకి సరిగ్గా ఆస్తిని పంచకపోతే ఆమె కోర్టుని ఆశ్రయించవచ్చు.