Fasting : మనకి మొత్తం 12 రాశులు. అయితే మనం రాశుల ఆధారంగా భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏ రాశి వాళ్ళు ఎలాంటి పద్ధతుల్ని పాటిస్తే, ఏం జరుగుతుందో అనేది కూడా తెలుసుకోవచ్చు. ఏ రాశి వారు, ఏ రోజు ఉపవాసం ఉంటే కోరికలు నెరవేరుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేష రాశి వాళ్లు మంగళవారం కానీ ఆదివారం కానీ ఉపవాసం చేస్తే కోరికలు నెరవేరుతాయి.
వృషభ రాశి వారు శుక్రవారం కానీ బుధవారం కానీ ఉపవాసం చేస్తే వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. మిధున రాశి వారి విషయానికి వస్తే, ఈ రాశి వాళ్ళ బుధవారం లేదా మంగళవారం ఉపవాసం ఉంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి. కర్కాటక రాశి వారు సోమవారం కానీ గురువారం కానీ ఉపవాసం చేయడం మంచిది. సింహ రాశి వాళ్ళు ఆదివారం కానీ మంగళవారం కానీ ఉపవాసం చేయటం మంచిది.
కన్య రాశి వాళ్లు మంగళవారం లేదా బుధవారం ఉపవాసం చేస్తే మంచిది. తుల రాశి వారి విషయానికి వస్తే, ఈ రాశి వాళ్ళు శుక్రవారం కానీ బుధవారం కానీ ఉపవాసం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారు, మంగళవారం కానీ ఆదివారం కానీ ఉపవాసం చేయడం మంచిది. ధనస్సు రాశి వారైతే, గురువారం కానీ ఆదివారం కానీ ఉపవాసం ఉండడం మంచిది.
మకర రాశి వాళ్ళు శనివారం లేదా బుధవారం ఉపవాసం ఉండడం మంచిది. కుంభ రాశి వారు అయితే, మంగళవారం లేదా ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. మీన రాశి వారు గురువారం కానీ ఆదివారం కానీ ఉపవాసం చేయడం మంచిది. ఇలా ఈ రాశి వాళ్ళు ఈ రోజుల్లో ఉపవాసం ఉంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. బాధల నుండి బయటపడి ఆనందంగా ఉండొచ్చు.