Salt To Hand : పురాతన కాలం నుంచి మనం అనేక ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నాం. కొన్నింటి వెనుక సైన్స్ దాగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అవి మనకు మంచి చేస్తాయని చెప్పి వాటిని మన పెద్దలు పెట్టారు. కొన్నింటిని మనం మన పురాణాలను చదివి పాటిస్తున్నాం. అయితే ఎప్పటి నుంచో చాలా మంది పాటిస్తున్న ఆచారాల్లో ఒకటుంది. అదే.. ఉప్పును చేతికి ఇవ్వకూడదని అంటారు.. దాన్నే చాలా మంది పాటిస్తుంటారు. అయితే దీని వెనుక అసలు కారణం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు అనేది దశ దానాల్లో ఒకటి. ఉప్పును సహజంగానే దానం ఇస్తారు. దీని వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు. అయితే అలాంటి ఉప్పును చేతికి ఇవ్వకూడదని.. ఇస్తే చెడు జరుగుతుందని.. భావిస్తారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఉప్పును డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన పక్షంలో చేత్తో తీసుకోవచ్చు. అదే దానం ఇస్తే మాత్రం చేత్తో తీసుకోరాదు.. అని పండితులు చెబుతున్నారు.
ఇక ఉప్పు మాత్రమే కాదు.. ఇలాంటి దానం చేసే వస్తువులు ఏవైనా సరే చేత్తో తీసుకోరాదు. వాటిని వేరే చోట ఉంచిన తరువాతే తీసుకోవాలి. కానీ డబ్బులు ఇచ్చి కొనే పక్షంలో మాత్రం చేత్తో తీసుకోవచ్చు. ఎందుకంటే సొమ్ము చెల్లిస్తున్నారు కనుక అది వారి సొంతమవుతుంది. అలాంటప్పుడు దాన్ని చేత్తో తీసుకోవచ్చు. ఇలా నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.