vastu

సాయంత్రం ఇంటి ప్ర‌ధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి.. ఎందుకో తెలుసా..?

చాలా మంది ఎంత సంపాదించినా డబ్బు నిల‌వ‌డం లేద‌ని చెబుతుంటారు. ఇక కొంద‌రైతే డ‌బ్బుల‌ను సంపాదించ‌లేక‌పోతుంటారు. అలాగే తీవ్ర‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు అనేవి చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. అయితే ఇంట్లో నుంచి ద‌రిద్రం పోయి ల‌క్ష్మీదేవిని ఆహ్వానించాలంటే.. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.

సాయంత్రం స‌మ‌యంలో ఇంటి ప్ర‌ధాన ద్వారాన్ని అసలు మూయ‌రాద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంది. అదేమిటంటే.. సాయంత్రం స‌మ‌యంలో మ‌హాలక్ష్మీ దేవి మ‌న ఇంట్లోకి ప్ర‌ధాన ద్వారం నుంచి లోప‌లికి వ‌స్తుంది. అందుక‌ని ఆ స‌మ‌యంలో ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి. దీంతో ల‌క్ష్మీదేవికి ఆహ్వానం ప‌లికిన‌ట్లు అవుతుంది. ఆమె సంతోషించి మ‌న‌కు ఆశీర్వాదం ఇస్తుంది. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు. డ‌బ్బు బాగా సంపాదిస్తారు.

why we should open our house main door in the evening

ఇక సాయంత్రం స‌మ‌యంలో ఇంటి ప్ర‌ధాన ద్వారాన్ని తెరిచి ఉంచ‌డంతోపాటు ఇంటి వెనుక ద్వారాన్ని మూసి ఉంచాలి. ఎందుకంటే ఆ స‌మ‌యంలో వెనుక ద్వారం నుంచి జ్యేష్టాదేవి లోప‌లికి వ‌స్తుంది. అలా జ‌రిగితే మ‌న‌కు ద‌రిద్రం ప‌డుతుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక సాయంత్రం స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్ర‌ధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి. అలాగే ఇంటి వెనుక ద్వారాన్ని మూసి ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Admin

Recent Posts