lifestyle

Watch : వాచ్‌ల‌ను ఎడ‌మ చేతికే ఎందుకు ధ‌రిస్తారో తెలుసా..?

Watch : రేడియో.. టీవీ.. కంప్యూట‌ర్‌.. ల్యాప్‌టాప్‌.. టాబ్లెట్.. ల్యాండ్ లైన్‌.. సెల్‌ఫోన్‌.. స్మార్ట్‌ఫోన్‌.. ఇలా దేంట్లో చూసినా అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన డివైస్‌లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి. అవ‌న్నీ వినియోగ‌దారుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి. కొత్త‌గా వ‌చ్చేవ‌న్నీ పాత వాటిని మ‌రిచిపోయేలా చేశాయి. అయితే ఓ వ‌స్తువును మాత్రం మ‌నం ఇప్ప‌టికీ వాడుతూనే ఉన్నాం. అంటే, అందులోనూ కొత్త త‌ర‌హా మోడ‌ల్స్ వ‌చ్చాయ‌నుకోండి, కానీ పాత త‌రం మోడ‌ల్స్‌ను రీప్లేస్ చేయ‌లేక‌పోయాయి. అవే రిస్ట్ వాచ్‌లు. అవును, అవే.

స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ బ్యాండ్‌లు రంగ ప్ర‌వేశం చేసినా సాధార‌ణ రిస్ట్ వాచీల వాడకం ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ అధిక శాతం మంది వీటిని ఉప‌యోగిస్తున్నారు. అయితే రిస్ట్ వాచ్ అయినా, స్మార్ట్‌వాచ్ లేదా స్మార్ట్ బ్యాండ్ ఏదైనా వాటిని మనం దాదాపుగా ఎడ‌మ చేతికే పెట్టుకుంటాం. క‌దా..! అంటే కుడి చేతికి పెట్టుకునే వారు కూడా ఉన్నార‌నుకోండి, కానీ వారు చాలా త‌క్కువ‌గా ఉంటారు. వారి విష‌యం ప‌క్క‌న పెడితే, అస‌లు వాచ్‌లను మ‌నం ఎడ‌మ చేతికే ఎందుకు పెట్టుకుంటామో తెలుసా..? ఈ విష‌యం మీరెప్పుడైనా ఊహించారా..? అయితే ఇప్పుడు మాత్రం ఊహించాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే… ఇది చ‌ద‌వండి..! వాచీని ఎడ‌మ చేతికే ఎందుకు పెట్టుకుంటారో తెలుస్తుంది..!

why we wear watches on left hand mostly

ఇప్పుడంటే రిస్ట్ వాచీలు ఉన్నాయి కానీ అస‌లు వాచ్‌ల‌ను త‌యారు చేయ‌డం ప్రారంభించిన‌ప్పుడు ముందుగా పాకెట్ వాచీలే ఉండేవి. జ‌నాలు వాటిని త‌మ జేబులో పెట్టుకుని తిరిగేవారు. కావ‌ల్సిన‌ప్పుడు బ‌య‌టికి తీసి టైం చూసుకునే వారు. అయితే కొంద‌రు ఆ పాకెట్ వాచీలను చేతికి ధ‌రించ‌డం మొద‌లు పెట్టారు. అలా ధ‌రించే క్ర‌మంలో వారు త‌మ ఎడ‌మ చేతికి వాచ్‌ల‌ను పెట్టుకునే వారు. ఎందుకంటే.. దాదాపుగా చాలా మంది కుడి చేతి వాటం క‌ల‌వారే కాబ‌ట్టి కుడి చేత్తో ప‌నిచేస్తున్న సంద‌ర్భంలో మాటి మాటికీ చేతిని పైకి లేపి టైం చూడ‌డం ఇబ్బంద‌వుతుంద‌ని భావించి, వాచ్‌ల‌ను ఎడ‌మ చేతికి ధ‌రించ‌డం షురూ చేశారు.

అది అప్ప‌ట్లో వారికి సౌక‌ర్య‌వంతంగా అనిపించింది. దీన్ని చూసి ఇత‌రులు కూడా అలా ధ‌రించడం స్టార్ట్ చేశారు. దీంతో అలా అలా ప‌లు కంపెనీలు రిస్ట్ వాచ్‌ల‌ను త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టాయి. ఈ క్ర‌మంలో అంద‌రూ వాచ్‌ల‌ను ఎడ‌మ చేతికే ధ‌రించ‌డం మొద‌లు పెట్టారు. అలా ధ‌రించడం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. స్మార్ట్‌వాచ్‌లు, బ్యాండ్‌లు వ‌చ్చినా వాటిని కూడా దాదాపుగా అధిక శాతం మంది ఎడ‌మ చేతికే ధ‌రిస్తున్నారు. సో, వాచ్‌ల‌ను ఎడ‌మ చేతికి ధ‌రించ‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ అది. తెలుసుకున్నారుగా..!

Admin

Recent Posts