ఈరోజుల్లో మనం సరిగ్గా వెళ్ళకపోయినా, ఎదుటి వాళ్ళు సరిగ్గా వెళ్లకపోయినా మనమే రిస్క్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా వెళ్లినా కూడ ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాలి. తాజాగా మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఒక మహిళ చనిపోగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది.
గురువారం ఉదయం ఏక్తా నగర్ చౌక్ ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం మీద ఓ జంట వెళ్తున్నారు. వేగంగా వెళ్తుండడంతో ఒక మహిళని ఢీకొన్నారు. దీనితో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సీసీ ఫుటేజ్ ద్వారా ఇవన్నీ మనం చూడొచ్చు.
స్పీడుగా బైక్ నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. చనిపోయిన ఆమెను విజయనగర్ కి చెందిన శ్రీ ప్యాసి గా గుర్తించారు. ద్విచక్ర వాహనం మీద ఆమె తన భర్తతో స్లోగా రోడ్డు దాటుతున్నారు. ఇంకో మోటార్ సైకిల్ చాలా స్పీడ్ గా ఎదురుగా వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఇద్దరు కిందపడిపోయారు. శ్రీ ప్యాసి అక్కడికక్కడే చనిపోయారు. మోటార్ సైకిల్ మీద వేగంగా వస్తున్న వ్యక్తి, శ్రీప్యాసి ప్యాసి భర్త ఇద్దరు కూడా తీవ్రంగా గాయాలు పాలయ్యారు.