దొంగతనాల గురించి, స్కాముల గురించి రోజుకో వార్త వింటూ ఉంటాం. చాలా మంది దొంగతనాల వలన మోసపోతూ ఉంటారు. అలాగే స్కాముల కారణంగా కూడా ఈ రోజుల్లో చాలామంది ఖాతా 0 అయిపొయింది. అయితే, ఒక మహిళ ఒంటరిగా ఇంట్లో ఉంటే దొంగలు వచ్చి దోచుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు అడ్డుకోవడానికి లేరు కదా..? ఓ మహిళ ఏం చేస్తుంది అని దొంగల గ్యాంగ్ ఈజీగా ఇంటిని దోచుకు వెళ్ళిపోతూ ఉంటుంది.
ఒకసారి ఇంట్లో ఒంటరిగా ఎవరైనా ఉంటే.. వాళ్ళని రెండు కొట్టి ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఎత్తుకెళ్లి పోతూ ఉంటారు. కానీ, మహిళ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి. ముగ్గురు దొంగలు ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేశారు. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. పంజాబ్ మహిళ వాళ్లందరినీ ఒక్కరే ఆపేసారు.
ముందు ఆమె తలుపుని గట్టిగా హోల్డ్ చేశారు. ఆ తర్వాత సోఫా తీసుకు వచ్చి తలుపుకి అడ్డంగా పెట్టేశారు. దొంగలను ఇంట్లోకి రానివ్వకుండా ఆమె చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఏ మాత్రం భయపడకుండా, ఆమె ధైర్యంతో దొంగలని ఇంట్లోకి రాకుండా చేశారు. సోఫాని అడ్డు పెట్టేసిన తర్వాత ఫోన్ చేశారు. బహుశా ఆమె పోలీసులకో లేకపోతే ఇంట్లో వాళ్ళెవ్వరికైనా ఫోన్ చేసి ఉండొచ్చు. ఆమెతో పాటుగా ఇంట్లో ఒక బాబు, ఒక పాప కూడా ఉన్నారు.