Turmeric To Feet : స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకోవడం చాలా మంచిది. స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పసుపు రాసుకోవాలని శాస్త్రం కూడా చెప్తోంది. అయితే స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు, ఇలా రాసుకుంటే మాత్రం దరిద్రం పట్టుకుంటుంది. మరి ఇక ఎటువంటి తప్పులు చేయకూడదు..? ఎలా కాళ్ళకి పసుపు రాసుకోకూడదు అనేది చూద్దాం. కాళ్ళకి పసుపు రాసుకోవడం అనేది ఎంతో మంచి పద్ధతి. అయితే కాళ్ళకి పసుపు రాసుకోవడంలో కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు.
దాంతో లక్ష్మీదేవి దూరమవుతుంది. చాలామంది చేతిలో పసుపు వేసుకుని, నీళ్ళని కూడా చేతిలో కలిపేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ముందు ఒక శుభ్రమైన గిన్నెను తీసుకోవాలి. అందులో పసుపు వేసి ఎంగిలి చేయనటువంటి నీళ్లు అందులో వేసి, మధ్య మూడు వేళ్ళని ఉపయోగిస్తూ పసుపుని కాళ్ళకి రాసుకోవాలని శాస్త్రం అంటోంది.
ఇలా పసుపు రాసుకుంటే, చాలా మంచి జరుగుతుందని దరిద్రం వంటి బాధలు ఉండవని, శాస్త్రం అంటోంది. అలా కాకుండా చేతిలో వేసుకుని ఏ నీళ్లతో పడితే ఆ నీళ్లతో పసుపుని కలుపుకుంటే, దాని వలన లక్ష్మీదేవి దూరమవుతుంది. పైగా పసుపుని అవమానించినట్లు అవుతుంది. కాబట్టి ఈ పొరపాటు చేయకండి. పసుపుని అవమానించడం వలన ఐశ్వర్యం దూరం అవడంతోపాటుగా ఆరోగ్యం కూడా పాడవుతుందట.
కాబట్టి ఈ పొరపాటు అస్సలు చేయకండి. పసుపులో చాలా చక్కటి గుణాలు ఉంటాయి. పసుపు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వంటల్లో కూడా పసుపుని ఉపయోగించడం మంచిది. పాలల్లో పసుపు వేసుకుని, రోజు చాలా మంది తీసుకుంటూ ఉంటారు. పసుపు నీళ్లు కూడా చాలామంది తాగుతూ ఉంటారు. పసుపుని ముఖానికి కూడా రాసుకుంటూ ఉంటారు. అందాన్ని కూడా పసుపు పెంపొందిస్తుంది. అయితే పసుపుని లిమిట్ గానే తీసుకోవాలి. మరీ ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు.