ఆధ్యాత్మికం

Bangles : స్త్రీలు గాజుల‌ను ఎలా ప‌డితే అలా వేటిని ప‌డితే వాటిని ధ‌రించ‌రాదు.. ఇలా ధ‌రిస్తే ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

Bangles : పెళ్లయిన ప్రతి స్త్రీ కూడా గాజులని వేసుకుంటూ ఉంటుంది. ఆడవారు గాజులు ఎలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనేది పండితులు చెప్పారు. ఆడవారు గాజులు ఏ విధంగా వేసుకుంటే లక్ష్మి కటాక్షం లభిస్తుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే తెలుసుకోవచ్చు. మనకి రకరకాలు గాజులు దొరుకుతాయి. మట్టి గాజులు ప్లాస్టిక్ గాజులు ఇలా.. అయితే ప్లాస్టిక్ గాజులని బంగారం గాజులని వేసుకుంటే లక్ష్మీ కటాక్షం లభించుదు. చాలామంది బంగారం ఖరీదైనది కదా బంగారం గాజులు వేసుకుంటే మంచిదేమో అని భ్రమ పడుతూ ఉంటారు కానీ నిజానికి లక్ష్మీ కటాక్షం రాదు. మట్టి గాజులను వేసుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

గాజులు స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు గాజులని వేసుకోవడం లేదు. అయితే లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్లంతా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చేతికి మట్టి గాజులు వేసుకోవాలి. బంగారం గాజులు వేసుకున్నప్పటికీ మట్టి గాజులని తప్పక ధరించాలి. మట్టి గాజులు వేసుకునేటప్పుడు రంగుల్ని కూడా చూసుకుంటూ ఉండాలి. ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం. ఎరుపు రంగు గాజులని వేసుకుంటే పనులన్నీ కూడా కాన్ఫిడెన్స్ తో పూర్తి చేయగలరు. నమ్మకంగా ప్రతి పనిని కూడా ఆ మహిళ చేసేస్తుంది.

women must wear bangles like this

ఆకుపచ్చ రంగులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో రాణించడానికి అవుతుంది. అదే పసుపు రంగు గాజులు వేసుకుంటే సంఘంలో మంచి పేరు వస్తుంది. బంగారం రంగులో ఉండే మట్టి గాజులని కనుక వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఆడవాళ్లు ఎరుపు రంగుని కానీ ఆకుపచ్చ రంగును కానీ పసుపు రంగు కానీ మట్టి గాజులని వేసుకునేటప్పుడు ఎంపిక చేసుకోవడం మంచిది. మట్టి గాజులు వేసుకునేటప్పుడు నలుపు రంగు కానీ నీలం, గ్రే కలర్ కానీ వేసుకోకూడదు. ఈ రంగు గాజులు వేసుకుంటే సమస్యలు కలుగుతాయి.

గాజులను ధరించడానికి కూడా కొన్ని రోజులు ఉన్నాయి. సోమవారం బుధవారం మట్టి గాజులని ధరిస్తే మంచిది. కనీసం అరడజను గాజులు వేసుకోండి. నిజానికి ఎక్కువ గాజులు వేసుకోవడం వలన సైంటిఫిక్ గా కూడా ఉపయోగం ఉంది. ఆరోగ్యానికి కూడా బాగా మేలు కలుగుతుంది. గాజుల వలన శరీరంలో రక్తప్రసరణ మణికట్టు భాగంలో వేగంగా పెరుగుతుంది. పైగా చేతులు అటూ ఇటూ కదలనప్పుడు గాజులు వెనక్కి ముందుకి వెళ్తాయి కదా అప్పుడు మసాజ్ అవుతుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. గాజులు వేసుకుంటే అలసట బాగా తగ్గుతుంది శరీరంలో శక్తి కూడా బాగా పెరుగుతుంది.

Admin

Recent Posts