Bottu : స్త్రీలు ఎప్పుడు కూడా ఈ ఐదు స్థానాల్లో బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు సౌభాగ్యంగా ఉంటారు. కుంకుమని ఎప్పుడూ రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు పార్వతీ దేవి ఒక స్త్రీ వైధవ్యం పొందకుండా ఎప్పుడూ సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? అని పరమ శివుడిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు.
ఈ ఐదు స్థానాలలో స్త్రీ కుంకుమ పెట్టుకుంటే వైధవ్యం పొందదని అంటాడు. మరి ఇక పరమ శివుడు పార్వతితో చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం. శివుడు పార్వతితో చెప్పినట్టు మనము కూడా ఆచరిస్తే సౌభాగ్యంగా ఉండవచ్చు. ఎప్పుడూ కూడా ఈ ఐదు చోట్ల కుంకుమ పెట్టుకోవాలట. ముందుగా ఇక్కడ కుంకుమ పెట్టుకోండి. అది పాపిట స్థానం. పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే, ఆ స్త్రీ సౌభాగ్యంతో ఉంటుంది.
రెండవ స్థానం కనుబొమ్మలు కలిసే మధ్య స్థానంలో. కనుబొమ్మలు కలిసే మధ్య స్థానంలో కుంకుమ పెట్టుకుంటే సౌభాగ్యంగా ఉండవచ్చు. అలానే మూడో స్థానం కంఠము కింద గుంతగా లోతుగా ఏర్పడే ప్రదేశంలో. అక్కడ కూడా బొట్టుని పెట్టుకోవాలి. స్త్రీ కుంకుమ పెట్టుకునే నాలుగవ ప్రదేశం వక్షస్థలం. ఇక్కడ కుంకుమ పెట్టుకుంటే సౌభాగ్యంగా ఉండచ్చు.
ఐదవది నాభి స్థానం. ఇక్కడ కూడా స్త్రీ కుంకుమ పెట్టుకోవాలట. ఇలా స్త్రీలు ఈ ఐదు స్థానాల్లో కూడా కుంకుమ బొట్టుని స్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన సౌభాగ్యంతో స్త్రీ ఉంటుంది. అటువంటి స్త్రీలకు భర్త ఎప్పుడూ దూరం అవ్వడు. అటువంటి స్త్రీల భర్త మరణించడం అనేది జరగదని, శివుడు పార్వతీ దేవికి చెప్తాడు. కనుక సౌభాగ్యంగా ఉండాలంటే స్త్రీలు ఈ ఐదు చోట్ల కుంకుమ పెట్టుకోవడం మంచిది.