మన శరీరానికి రోజూ అవసరం అయ్యే పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. ఇవి స్థూల పోషకాల కిందకు చెందుతాయి. అంటే మనకు రోజూ ఎక్కువ మొత్తంలో ఇవి అవసరం అవుతాయి. ఎవరైనా సరే వారి శరీర బరువుకు అనుగుణంగా ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు మనకు శక్తిని ఇవ్వడంతోపాటు కణాల నిర్మాణానికి, పెరుగుదల, మరమ్మత్తులకు దోహదపడతాయి. అయితే రోజూ తగినంత మోతాదులో ప్రోటీన్లను తీసుకోకపోతే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రోటీన్లను తగినంత మోతాదులో తీసుకోకపోతే శరీరం వాపులకు గురవుతుంది. దీన్నే ఎడిమా అంటారు. దీని వల్ల పొట్ట, కాళ్లు, పాదాలు, కళ్ల చుట్టూ, చేతులు వాపులకు గురై కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తుంటే ప్రోటీన్లను తగినంత మోతాదులో తీసుకోవడం లేదనే అర్థం చేసుకోవాలి. వెంటనే ప్రోటీన్లను తీసుకోవాలి. దీంతో ప్రోటీన్ల లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.
2. ఎల్లప్పుడూ నీరసంగా ఉండడం, అలసట, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఆకలి ఎక్కువగా ఉండడం, జుట్టు రాలడం, గోళ్లు విరిగిపోవడం, చర్మం పొలుసుల్లా మారడం, లివర్ ఫెయిల్ అవడం, ఎముకలు బలహీనంగా మారడం వంటివన్నీ ప్రోటీన్ల లోపంతో వచ్చే సమస్యలే.
3. ప్రోటీన్ల లోపం ఉంటే శరీరానికి శక్తి సరిగ్గా లభించదు. దీంతో అలసిపోతుంటారు. అలాగే చర్మ సమస్యలు వస్తాయి.
ఈ లక్షణాలు ఉంటే ప్రోటీన్ల లోపం ఉన్నట్లు భావించాలి. వెంటనే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాలి. దీంతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక మనకు ప్రోటీన్లు ఎక్కువగా మొలకెత్తిన పెసలు, పప్పు దినుసులు, ఓట్స్, తృణ ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, కోడిగుడ్లు వంటి వాటిల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తీసుకోడం వల్ల ప్రోటీన్ల లోపం నుంచి బయట పడవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365