పోష‌ణ‌

అయోడిన్ మన శరీరానికి ఎందుకు అవసరమో తెలుసా.? అది ఏయే ఆహారాల్లో ఉంటుంది అంటే..?

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో అయోడిన్ కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. థైరాయిడ్ హార్మోన్‌కు అత్యంత ఆవశ్యకమైన పోషక పదార్థం ఇది. దీంతో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది. ఇక గర్భిణీలకు అయోడిన్ చాలా ఎక్కువ మోతాదులో కావల్సి ఉంటుంది. అయోడిన్ సరిగ్గా అందకపోతే థైరాయిడ్ గ్రంథి వాపుకు లోనవుతుంది. ఫలితంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అలసట, నీరసం, బరువు బాగా పెరగడం లేదా బాగా తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు కండరాల నొప్పులు, నోట్లో ఎప్పుడు పొడిగా ఉండడం తదితర సమస్యలు కూడా వస్తాయి. కనుక అయోడిన్ ఉన్న ఆహారాన్ని నిత్యం మనం కచ్చితంగా తీసుకోవాల్సిందే. మరి అయోడిన్ ఏయే ఆహార పదార్థాల్లో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

పాలు, దాని సంబంధ ఉత్పత్తుల్లో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. ఒక కప్పు పాలు తాగితే మనకు రోజు మొత్తానికి కావల్సిన అయోడిన్‌లో 59 నుంచి 112 శాతం వరకు అందుతుంది. అలాగే పన్నీర్, పెరుగు తదితర పాల ఉత్పత్తుల్లోనూ అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకుంటే అయోడిన్ లోపాన్ని అధిగమించవచ్చు. మనం తినే ఉప్పు అయోడైజ్డ్ ఉప్పు అయి ఉండాలి. సాధారణ ఉప్పు తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయోడైజ్డ్ ఉప్పు అయితే మన శరీరానికి అయోడిన్ అందుతుంది. అయితే ఈ ఉప్పును సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకోరాదు. రొయ్యలు (పచ్చివి లేదా ఎండువి) మనకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. వీటిల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇక అయోడిన్ వీటిలో పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి12, పాస్ఫరస్‌లు రొయ్యల్లో పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో రొయ్యలను తరచూ తింటే ఈ విటమిన్ల వల్ల వచ్చే లోపాల నుంచి బయట పడవచ్చు.

do you know why iodine is required for us

సముద్రపు చేపల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు మన శరీరానికి కావల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఈ చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. రోజూ ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తిన్నా చాలు. దాంతో మన శరీరానికి కావల్సిన అయోడిన్ అందుతుంది. దీంతోపాటు ప్రోటీన్లు, ఫాట్స్, విటమిన్లు, ఇతర మినరల్స్ కూడా గుడ్ల ద్వారా మనకు లభిస్తాయి. అయితే కోడిగుడ్డులో పచ్చసొన తింటేనే ఈ పోషకాలు మనకు అందుతాయి. అరటిపండ్లు, క్యారెట్లు, స్ట్రాబెర్రీలు, తృణ ధాన్యాలు తదితర ఆహారాల్లోనూ అయోడిన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకుంటుంటే అయోడిన్ లోపాన్ని సరిచేసుకోవచ్చు.

Admin

Recent Posts