Anjeer : అంజీర్ పండ్ల‌కు చెందిన ఈ ర‌హ‌స్యాలు మీకు తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Anjeer : డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో అంజీర్ కూడా ఒక‌టి. అంజీర్ లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. తీపి వంట‌కాల్లో అంజీర్ ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇవి చాలా చ‌క్కటి రుచిని క‌లిగి ఉంటాయి. అంజీర్ ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే అంజీర్ ను ఎలా తీసుకోవాలి.. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి..వీటిని తీసుకోవాల్సిన స‌రైన స‌మ‌యం ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అంజీర్ ను పోష‌కాల గ‌ని అని నిపుణులు చెబుతూ ఉంటారు. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి.

దీనిలో కార్బోహైడ్రేట్స్, విట‌మిన్ సి, ఐర‌న్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అంజీర్ ను రోజూ రాత్రి ప‌డుకునే ముందు నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవాలి. అలాగే పాల‌ల్లో కూడా నాన‌బెట్టి తీసుకోవ‌చ్చు. అంజీర్ ను నాన‌బెట్ట‌కుండా తీసుకోవడం వ‌ల్ల శ‌రీరంలో వేడి చేస్తుంది. అందుకే అంజీర్ ను నాన‌బెట్టి మాత్ర‌మే తీసుకోవాలి. ఇలా రోజూ అంజీర్ ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా, ఆరోగ్యంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంజీర్ ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో మ‌లినాలు తొల‌గిపోయి శ‌రీరం శుభ్ర‌ప‌డుతుంది. అంతేకాకుండా అంజీర్ ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. దీనిలో ఉండే ఫైబ‌ర్ పొట్ట‌ను శుభ్రం చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

Anjeer facts you must know about them
Anjeer

అలాగే దీనిలో ఉండే పొటాషియం ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. అంజీర్ ను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌రాల నొప్పులు, భుజాల నొప్పులు త‌గ్గుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అదే విధంగా అంజీర్ ను తిన‌డం వ‌ల్ల బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. గొంతు నొప్పిని త‌గ్గించ‌డంలో కూడా అంజీర్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. రోజూ రెండు లేదా మూడు అంజీర్ ల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts