Blueberries : ఈ పండ్ల గురించి తెలుసా.. రోజూ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Blueberries : మ‌నం వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో బ్లూబెర్రీలు కూడా ఒక‌టి. వీటిని ఎక్కువ‌గా స‌లాడ్స్, తీపి ప‌దార్థాలు, తీపి పానీయాల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటారు. వీటి రుచి చాలా చ‌క్క‌గా ఉంటుంది. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఎక్కువ‌గా సూప‌ర్ మార్కెట్ ల‌లో ఇవి ల‌భిస్తూ ఉంటాయి. బ్లూబెర్రీల‌ను కూడా మ‌నం త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బ్లూబెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి.

బ‌రువు త‌గ్గాల‌నుకునే బ్లూబెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మ‌న‌లో చాలా మంది జీవ‌క్రియ లోపాల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. శ‌రీరంలో జీవ‌క్రియ వేగం త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. జీవ‌క్రియ రేటు త‌క్కువ‌గా ఉన్న‌వారు క్ర‌మం తప్ప‌కుండా 5 నుండి 7 వారాల పాటు బ్లూబెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల జీవ‌క్రియ వేగం పెరుగుతుంది. బ్లూబెర్రీల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల ర‌క్త‌నాళాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. గుండె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. రక్త‌పోటు అదుపులో ఉంటుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది.

Blueberries benefits in telugu must take them daily
Blueberries

మూత్రాశ‌యం ఇన్ఫెక్ష‌న్ ల‌తో బాధ‌ప‌డే వారు వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బ్లూబెర్రీల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ప్రేగుల్లో క‌ద‌లికలు చ‌క్క‌గా ఉంటాయి. ఈ విధంగా బ్లూబెర్రీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అయితే వీటిని త‌క్కువ మోతాదులో మాత్ర‌మే ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts