Fish 65 : చేపలతో ఎంతో రుచిగా ఇలా ఒకసారి చేయండి.. టేస్ట్‌ చూస్తే మళ్లీ ఇలాగే కావాలంటారు..!

Fish 65 : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది వివిధ రకాల నాన్‌ వెజ్‌ వంటలను చేసుకుని తింటుంటారు. అందులో ముఖ్యంగా ఈ సీజన్‌లో చాలా మంది చేపలను ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇవి చికెన్‌, మటన్‌ మాదిరిగా వేడి చేయవు. కనుక చేపలకు ఈ సీజన్‌ లో ఫుల్‌ గిరాకీ ఉంటుంది. అయితే చేపలను ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ఫిష్‌ 65 రూపంలో చేసి తినండి. ఎంతో బాగుంటాయి. ఈ క్రమంలో ఫిష్‌ 65ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిష్‌ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..

చేపలు – పావు కిలో (3 అంగుళాల మందంతో ముక్కలు కోయాలి), పసుపు – పావు టీస్పూన్‌, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీస్పూన్‌ చొప్పున, గుడ్డు – 1, మైదా, మొక్కజొన్న పిండి – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున, చిల్లీ పేస్ట్‌ – ఒక టీస్పూన్‌, సోయా సాస్‌, ధనియాల పొడి – ఒక టీస్పూన్‌ చొప్పున, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీస్పూన్‌, నిమ్మరసం – ఒక టేబుల్‌ స్పూన్‌.

Fish 65 recipe in telugu how to make this
Fish 65

ఫిష్‌ 65ని తయారు చేసే విధానం..

చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం, పసుపు, మిరియాల పొడి, చిల్లీ పేస్ట్‌, నిమ్మరసం, సోయాసాస్‌ వేసి బాగా కలిపి పట్టించాలి. వీటిని 20 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత దీంట్లో గుడ్డు, మొక్కజొన్న పిండి, మైదా వేసి ముక్కలకు బాగా పట్టించాలి. కడాయిలో నూనె వేడి చేసి మధ్యస్థంగా ఉండే మంట మీద వేయించాలి. వీటిని వేడి వేడిగా టమాటా, చిల్లీ సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Editor

Recent Posts