Dried Apricots : ఈ పండ్ల‌లో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా.. తెలిస్తే ఇప్పుడే తెచ్చుకుని తింటారు..!

Dried Apricots : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ఆఫ్రికాట్ కూడా ఒక‌టి. ఇత‌ర పండ్ల వ‌లె ఆఫ్రికాట్ ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌కు పండు రూపంలో అలాగే డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా ఈ ఆఫ్రికాట్ మ‌న‌కు ల‌భిస్తుంది. డ్రై ఆఫ్రికాట్ తో చేసే కుర్బానికి మీటా అనే తీపి వంట‌కాన్ని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ తీపి వంట‌కం నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉంటుంది. అలాగే ఇత‌ర తీపి వంట‌కాల త‌యారీలో వీటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. డ్రై ఆఫ్రికాట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని దీనిలో ఎన్నో ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఆఫ్రికాట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే మేలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్రికాట్ ల‌లో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఇది ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కంటికి సంబంధించిన స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అదే విధంగా ఈ పండ్ల‌ల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్ మ‌న జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్రేగులు శుభ్ర‌ప‌డ‌తాయి. దీంతో మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి. జీర్ణ‌స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆఫ్రికాట్ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

Dried Apricots in telugu must take them
Dried Apricots

అలాగే వీటిలో ఉండే పొటాషియం ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. త‌ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోతాయి. అంతేకాకుండా శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ న‌శింప‌బ‌డ‌తాయి. శ‌రీరం శుభ్ర‌ప‌డుతుంది. అదే విధంగా ఈ పండ్ల‌ల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డే వారు ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా ఈ పండ్లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల వృద్దాప్య‌చాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది.

ఆఫ్రికాట్ ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ఎముక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఆఫ్రికాట్ లు ఈ విధంగా మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లు మ‌న‌కు అన్నివేళ‌లా ల‌భించ‌వు. క‌నుక ఈ పండ్లు దొరికే కాలంలోమాత్రం త‌ప్ప‌కుండా తీసుకోవాలి. అయితే ఇవి మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో ల‌భిస్తాయి. క‌నుక రోజూ ఒక‌టి లేదా రెండు డ్రై ఆఫ్రికాట్ ల‌ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే డ్రై ఆఫ్రికాట్ ల‌ను తిన్న త‌రువాత నోటిని చ‌క్క‌గా శుభ్రం చేసుకోవాలి. లేదంటే దీనిలో ఉండే చ‌క్కెర‌లు దంతాల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

D

Recent Posts