రోజుకో యాపిల్ పండును తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

రోజుకో యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు అని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ మాట ఇప్పుడు వ‌చ్చింది కాదు, 1860ల‌లో ఉద్భ‌వించింది. అప్ప‌ట్లో eat an apple on going to bed, and you’ll keep the doctor from earning his bread అని అనే వారు కానీ త‌రువాత అది an apple a day keeps the doctor away గా మారింది. అయితే యాపిల్ పండ్ల‌ను నిజానికి రోజూ తినాలి. రోజుకు ఒక యాపిల్‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజుకో యాపిల్ పండును తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

1. యాపిల్ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఒక సాధార‌ణ సైజు యాపిల్‌లో సుమారుగా 5 గ్రాముల ఫైబ‌ర్ ల‌భిస్తుంది. మ‌న‌కు రోజుకు 25 గ్రాముల వ‌ర‌కు ఫైబ‌ర్ కావాలి. అంటే మ‌నకు కావ‌ల్సిన రోజు వారీ ఫైబ‌ర్‌లో దాదాపుగా 20 శాతం ల‌భిస్తుంద‌న్నమాట‌. దీని వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం రాదు. జీర్ణాశ‌యంలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు జ‌రుగుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

2. రోజుకు ఒక యాపిల్‌ను తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. 2018లో కొంద‌రు సైంటిస్టులు ఈ విషయంపై అధ్య‌య‌నం చేప‌ట్టారు. 12 వారాల పాటు రోజుకు 240 నుంచి 720 మిల్లీగ్రాముల యాపిల్ జ్యూస్‌ను తాగిన వారిలో బ‌రువు త‌గ్గిన‌ట్లు గుర్తించారు. అందువ‌ల్ల యాపిల్ పండును రోజుకు ఒక్క‌టి తిన్నా చాలు.. సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

3. అనేక తీవ్ర‌మైన వ్యాధుల‌కు శరీరంలో వ‌చ్చే వాపులే కార‌ణ‌మ‌వుతుంటాయి. అయితే యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల వాపులు రాకుండా నిరోధించ‌వ‌చ్చు. యాపిల్ పండ్ల‌లో క్వ‌ర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపుల‌ను త‌గ్గిస్తుంది. క‌ణాల‌ను ర‌క్షిస్తుంది. దీని వ‌ల్ల వ్యాధులు రాకుండా జాగ్రత్త ప‌డ‌వ‌చ్చు.

4. రోజుకో యాపిల్‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. షుగ‌ర్ లేనివారికి ఆ వ్యాధి వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది. 2013లో సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నం ప్ర‌కారం.. రోజూ యాపిల్‌ను తిన‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గిన‌ట్లు గుర్తించారు. అందువ‌ల్ల యాపిల్‌ను తింటే షుగ‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు. షుగ‌ర్ ఉన్న‌వారికి షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి.

5. యాపిల్ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఒక మీడియం సైజు యాపిల్‌ను తింటే మ‌న‌కు రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సి లో 14 శాతం అందుతుంది. అందువ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

6. యాపిల్ పండ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌తో చ‌నిపోయే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. ఈ విష‌యాన్ని 2016లో సైంటిస్టులు నిర్వ‌హించిన అధ్య‌య‌నం ద్వారా వెల్ల‌డించారు.

క‌నుక రోజుకు ఒక యాపిల్‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

Trending News :
► ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!
► బ్రౌన్ రైస్ ను నిత్యం తినాల్సిందే.. బ్రౌన్ రైస్ వ‌ల్ల క‌లిగే లాభాలు ఇవిగో..!
► వేగంగా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా ? అయితే జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగండి.. ఇంకా ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!
► శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Admin

Recent Posts